Begin typing your search above and press return to search.
#రేర్ గిఫ్ట్: మెగాస్టార్ ని సత్కరించిన ఆస్కార్ దిగ్గజాలు
By: Tupaki Desk | 21 March 2021 5:39 AM GMTమెగాస్టార్ అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకనిర్మాతలు.. ఆస్కార్ గ్రహీతలు అయిన క్రిస్టోఫర్ నోలాన్.. మార్టిన్ స్కోర్సెస్ స్వయంగా మెగాస్టార్ ని సత్కరించారు. భారతదేశ సినీ వారసత్వాన్ని కాపాడేందుకు చేసిన కృషికి గానూ ఈ గౌరవం.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లెజెండరీ నటుడు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను హాలీవుడ్ లెజెండ్స్ నోలాన్.. మార్టిన్ స్వయంగా సత్కరించారు. కొన్నేళ్లుగా ప్రపంచ సినీ వారసత్వాన్ని కాపాడటానికి కృషి చేస్తున్న మార్టిన్.. నోలన్ వర్చువల్ వేడుక ద్వారా అమితాబ్ బచ్చన్ కు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్‌ఐఎఎఫ్) అవార్డును అందజేశారు.
బిగ్ బి ఇన్ స్టాగ్రామ్ లో తనకు జరిగిన సన్మానం వివరాల్ని అందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాత ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ నుండి అవార్డు అందుకున్న చిత్రాన్ని అమితాబ్ పంచుకున్నారు. “కొన్ని సంవత్సరాల క్రితం ఈ గొప్ప వ్యక్తిని కలిసే భాగ్యం నాకు లభించింది. భారతదేశ చలన చిత్ర వారసత్వ సంరక్షణ కోసం మీరు చేసిన ప్రతిదానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించాం” అని అమితాబ్ పై నోలాన్ ప్రశంసల వర్షం కురిపించారు.
హాలీవుడ్ దిగ్గజాలు మార్టిన్ .. నోలన్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ అమితాబ్ బచ్చన్ ఒక నోట్ ని ఇన్ స్టాలో రాశారు. ``భారతదేశ చలన చిత్ర వారసత్వాన్ని కాపాడటానికి మా నిబద్ధత కదిలించలేనిది. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ మా చిత్రాలను కాపాడటానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నాలను కొనసాగిస్తుంది`` అని వెల్లడించారు.
ఇన్ సెప్షన్ లాంటి ఆస్కార్ చిత్రాన్ని తెరకెక్కించిన నోలాన్.. తన చిత్రాలకు డజన్ల కొద్దీ ఆస్కార్ లు అందుకున్న మార్టిన్ సోర్సరర్ స్వయంగా బిగ్ బి అమితాబ్ ని సత్కరించడం అరుదైన గౌరవం అన్న ప్రశంసలు ఇండస్ట్రీ వర్గాల్లో కురుస్తున్నాయి.