Begin typing your search above and press return to search.

తొలి ముద్దు రేంజ్‌లో ఖంగారుపడ్డా

By:  Tupaki Desk   |   26 May 2015 5:30 PM GMT
తొలి ముద్దు రేంజ్‌లో ఖంగారుపడ్డా
X
తొలి ముద్దు చిరు బుగ్గని తాకినప్పుడు .. తొలిసారి కౌగిలింతలో తడిసి ముద్దయినప్పుడు .. తొలిసారి శోభనం చేసుకున్నప్పుడు.. ఆ కుదుపే వేరుగా ఉంటుంది. తొలిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు అదే రేంజులో తడబడిపోయానని చెబుతోంది రాశి ఖన్నా.

తొలిఛాన్స్‌ వచ్చినప్పుడు కంగారు పడ్డా. పరాయి భాష, అర్థం కాని భాష అనుకుని భేజారెత్తాను. కానీ ఆ తర్వాత తెలిసింది. పరిచయం అయిపోతే పని సులువేనని తెలిసిపోయింది. అంతేనా సెట్‌కి వెళ్లినప్పుడు అస్సలు నాలో ఏ భయం లేకుండా అంతా కలిసిపోయారు. పైగా సినిమాపై నాకున్న ప్రేమ ధైర్యంగా ముందడుగు వేయించింది.. అంటూ క్లారిటీనిచ్చింది. ఇవన్నీ సరే మిస్‌ రాశీ హిట్టు మీద హిట్టు కొట్టేస్తూ ముందుకెళుతున్న ఈ శుభతరుణంలో స్వీయానుభవాల నుంచి తెలుసుకున్న విషయాలేంటి? అన్న ప్రశ్న వేస్తే... సినిమా వాతావరణానికి అలవాటు పడితే అన్నీ సులువే. ఒప్పుకున్న పాత్రలకు న్యాయం చేయాలి. రొటీనిటీ లేకుండా కొత్త తరహా పాత్రల్ని ఎంచుకుని అందరినీ మెప్పించాలి.. అన్నది తెలుసుకున్నా. ఆ ప్రకారమే ప్లాన్‌ గీస్తున్నా అని చెప్పింది.

అన్నట్టు జిల్‌తో విజయం అందుకున్న రాశి ప్రస్తుతం మాస్‌రాజా రవితేజ సరసన బెంగాళ్‌ టైగర్‌లో, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన 'శివం' సినిమాలో ఆడిపాడుతోంది. వీలైతే ఇంకో రెండు పెద్ద సినిమాలు సైన్‌ చేశేలా ఉంది బంగారం.