Begin typing your search above and press return to search.
ఆ క్రికెటర్ ఎవరో కూడా తెలియదన్న రాశి
By: Tupaki Desk | 23 March 2018 5:07 AM GMT‘తొలి ప్రేమ’తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన రాశి ఖన్నా గురించి కొన్ని రోజుల కిందట ఒక చిత్రమైన రూమర్ బయటికి వచ్చింది. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో ఆమె ప్రేమాయణం నడుపుతోందంటూ బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ ప్రచారం కొంచెం హద్దులు దాటి బుమ్రాను రాశి పెళ్లి కూడా చేసేసుకుందంని కూడా అక్కడ ప్రచారం జరిగిపోయింది. దీనిపై బుల్లితెరపై ఆలీ నిర్వహించే ఓ కార్యక్రమంలో రాశి స్పష్టత ఇచ్చింది. దీని గురించి అడిగినందుకు ముందు ఆలీకి థ్యాంక్స్ చెప్పి మరీ రాశి వివరణ ఇచ్చింది. బుమ్రా అనేవాడు ఒక క్రికెటర్ అని మాత్రమే విన్నానని.. అతకుమించి అతడి గురించి తనకేమీ తెలియదని రాశి చెప్పింది.
తనకు క్రికెట్ మీద పెద్దగా ఆసక్తి లేదని.. కనీసం బుమ్రా ఆడిన మ్యాచ్ లు కూడా తాను చూడలేదని.. వ్యక్తిగా అతనెవరో అస్సలు తెలియదని రాశి చెప్పింది. ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తనకు తెలియదని.. కొన్ని హిందీ వెబ్ సైట్లు ఏం తోచక ఇలాంటి రూమర్లు పుట్టించినట్లున్నాయని రాశి చెప్పింది. ఇలాంటివి వింటే చాలా చిరాగ్గా ఉంటుందని ఆమె అంది. ఒక మెగా హీరోతో ప్రేమలో ఉన్నారటగా అని ఆలీ రాశిని ప్రశ్నిస్తే.. ‘‘ఎక్కడి నుంచి రాస్తారండీ ఇవన్నీ. ఎవరా హీరో మీరే చెప్పండి’’ అని ఆలీని ఎదురు ప్రశ్నించింది. ఆలీ తనకు ఆ విషయం తెలియదని.. ప్రచారం జరగడంతో అలా అన్నానని అంటే.. తనకైతే ఎవరితోనూ ఎఫైర్లు లేవని రాశి స్పష్టం చేసేది. టీనేజీలో చదువుకునే రోజుల్లో ఒక క్రష్ ఉండేదని.. అంతకుమించి తన జీవితంలో సీరియస్ లవ్ స్టోరీలేమీ లేవని స్పష్టం చేసిందామె.