Begin typing your search above and press return to search.

మీడియం రేంజ్ లోనే ఆగిపోయిన ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   5 Jun 2021 11:30 PM GMT
మీడియం రేంజ్ లోనే ఆగిపోయిన ముద్దుగుమ్మ
X
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా అడపా దడపా ఆఫర్లతో కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈమె వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న కారణంగా ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ తో నటించినా ఆ మూవీ వల్ల తర్వాత పెద్ద ఆఫర్లు దక్కలేదు. ఎన్టీఆర్‌ తో ఆమె చేసిన రొమాన్స్ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

ఫిల్మ్‌ మేకర్స్ కూడా స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె వర్కౌట్‌ అవ్వడం అనుమానమే అన్నట్లుగా భావించారు. అందుకే ఆమెకు బడా హీరోల నుండి పిలుపు రావడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌ లో జై లవుకుశ మినహా మరే పెద్ద హీరో సినిమాలో ఆమె కు నటించే అవకాశం రావడం లేదు. రాశి ఖన్నాకు వస్తున్న ఆఫర్లు మీడియం రేంజ్ లోనే ఉంటున్నాయి. తమిళంలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాల షూటింగ్ లు నిలిచి పోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశిఖన్నా ఆ వెంటనే ఒక తమిళ సినిమా చిత్రీకరణ లో పాల్గొనేందుకు సిద్దం అయ్యింది. రాశిఖన్నా ముందు ముందు కూడా మీడియం రేంజ్ ఆఫర్లతోనే కెరీర్‌ లో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో అయినా ఆమెకు ఆఫర్లు పెద్దవి వస్తాయా అనేది చూడాలి.