Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: ఎలా చూసినా మత్తెక్కాల్సిందే

By:  Tupaki Desk   |   15 April 2016 7:30 AM GMT
ఫోటోస్టోరీ: ఎలా చూసినా మత్తెక్కాల్సిందే
X
కుర్ర హీరోయిన్లలో క్రేజ్ ఉన్న భామల్లో రాశి ఖన్నా కూడా ఉంటుంది. రాబోయే కాలంలో కాబోయే స్టార్ హీరోయిన్ అన్న కళను ఫేస్ లోనే ప్రదర్శించేస్తూ ఉంటుంది రాశి. గతంలో అమ్మడి పర్సనాలిటీ కాస్త బొద్దుగా ఉండేది కానీ.. ఈ మధ్య బాగానే తగ్గింది.

సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ మూవీలో చేస్తున్న పోలీస్ పాత్ర కోసం.. తన పర్సనాలిటీని బాగానే తగ్గించుకుంది రాశి ఖన్నా. మరీ స్లిమ్ లుక్ అనలేం కానీ.. గతంతో పోల్చితే చిక్కాక అమ్మడి మేని మెరుపు రెట్టింపైంది. ఫోటో షూట్స్ లో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

ముందు నుంచి తన అందాలను, వెనక నుంచి తన ఫ్యాషన్ ట్రెండ్ ను ప్రదర్శిస్తూ.. రాశి ఇచ్చిన పోజులు కుర్రకారును మత్తెక్కిస్తున్నాయి. వెనుక నుంచి చూస్తే రాశి ఇంత అందంగా ఉంటుందా అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఏమైనా అందాల ప్రదర్శనలో అబ్జెక్షన్స్ లేని ఈ భామ.. ఆరబోతలో కొత్త ట్రెండ్ ఏదో ట్రై చేస్తున్నట్లుంది కదూ.