Begin typing your search above and press return to search.
వీడియో: బబ్లీ బ్యూటీ ఇంత స్లిమ్ గా మారడం వెనుక సీక్రెట్ ఇదేనా..!
By: Tupaki Desk | 7 July 2021 5:21 PM GMT'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుని స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అన్ని భాషలు కలుపుకుని 8 సినిమాలు - 2 వెబ్ సిరీస్ లు చేస్తోందంటేనే రాశీ పాప ఎంత బిజీగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒక కారణం ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు నాజూగ్గా మారిపోవడమే అని తెలుస్తోంది. గ్లామర్ షో చేయడానికి కూడా అమ్మడు రెడీగా ఉంటడం మరో కారణంగా చెప్పుకుంటున్నారు.
నిజానికి కెరీర్ ఆరంభంలో రాశీ ఖన్నా తెరపై పెద్దగా అందాల ప్రదర్శన చేయలేదు. అయితే అవకాశాలు సన్నగిల్లడంతో రూట్ మార్చేసింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలో బికినీలో దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. జీరో సైజ్ లోకి రావడానికి పర్ఫెక్ట్ ఫిజిక్ తెచ్చుకోడానికి రాశీ చాలానే కష్టపడింది. అయితే ఇంకా స్లిమ్ గా రెడీ అవ్వాలని ఫిక్స్ అయిన ఈ బ్యూటీ.. మరింత శ్రమిస్తోంది. జిమ్ లో భారీ వర్కవుట్స్ చేస్తూ చెమటలు కక్కిస్తోంది.
తాజాగా రాశీఖన్నా జిమ్ లో వర్కౌట్స్ కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘లోడింగ్’ అంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే.. రాశీ రెగ్యులర్ గా ఎలాంటి కసరత్తులు చేస్తుందనేది తెలుస్తుంది. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్ - తోటి సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. ఫోటో షూట్ లతో కుర్రకారుని మంత్రముగ్దులను చేస్తూ వస్తున్న రాశి.. ఈ వీడియోతో అందరిని ఫిట్నెస్ మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన 'థాంక్యూ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే గోపీచంద్ తో కలసి 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తోంది. వీటితో పాటుగా ఒక మలయాళ సినిమా మరియు ఐదు తమిళ చిత్రాల్లో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగుపెడుతోంది. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో రాశీ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అలానే అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో రాశీ ఓ సైకో కిల్లర్ పాత్ర చేస్తోంది.