Begin typing your search above and press return to search.
రవి బాంబ్ అంటున్న తమన్నా చెల్లెలు
By: Tupaki Desk | 5 Dec 2015 1:30 PM GMTయంగ్ బ్యూటీ రాశి ఖన్నా.. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శివం నిరాశ పరిచినా.. రెండు నెలల్లోనే మరో మూవీ రిలీజ్ కి రెడీ అవడంతో.. ఇప్పుడు హోప్స్ అన్నీ రవితేజ మీదే పెట్టుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ ను.. బెంగాల్ టైగర్ తన ఖాతాలో వేస్తాడన్నది ఈ చిన్నదాని కోరిక. మరి బెంగాల్ టైగర్ తో పాటు మరిన్ని విశేషాలు పంచుకుంటోంది రాశి ఖన్నా
- బెంగాల్ టైగర్ అవకాశం ఎలా వచ్చింది. ?
జిల్ మూవీని చూసిన సంపత్ నంది నన్ను సంప్రదిచాడు. నా కేరక్టర్ గురించి వినగానే.. వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశాను
-ఈ మూవీలో మీ పాత్ర ఏంటి ?
శ్రద్ధ అనే రోల్ చేస్తున్నారు. ఈ పాత్రకు తన తండ్రితో ఎంతో అనుబంధం ఉంటుంది. రావు రమేష్ తో చేసిన సన్నివేశాలు ఎంతో అలరిస్తాయి.
-బెంగాల్ టైగర్ షూటింగ్ అనుభవాల గురించి ?
నా కెరీర్ లో బెంగాల టైగర్ చాలా పెద్ద సినిమా. రవితేజ - తమన్నాలతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ స్క్రిప్ట్ లోనే చాలా ఫన్ ఉంటుంది. పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెబ్తున్నా.
-తమన్నా లీడ్ గా, మీరు సెకండ్ హీరోయిన్ గా చేయడంపై ఏమన్నా ఫీలయ్యారా ?
ఖచ్చితంగా లేదు. నా పాత్ర గురించి నాకు ముందే తెలుసు. అలాగే తమన్నా నుంచి చాలా నేర్చుకున్నా. నన్ను తన సొంత చెల్లిగా చూసుకుని, డ్యాన్సులు - మేకప్ సహా బోలెడు నేర్పించింది.
- రవితేజ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పండి ?
రవితేజతో పని చేశాక.. ఇంతకు ముందు కంటే పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఆయనో బాంబ్ లాంటోడు - ఆన్ స్క్రీన్ - ఆఫ్ స్క్రీన్ లలో ఎంతో ఎనర్జీతో ఉంటారు. ఆయన లెవెల్స్ లని మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డా. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పాటల్లో ఈ విషయం మీకు అర్ధమవుతుంది.
- గ్లామరస్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు ఎందుకు ?
ఇందులో తప్పేం లేదు. గ్లామర్, డీగ్లామర్ రోల్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఊహలు గుసగుసలాడే చిత్రంలో నా డీగ్లామర్ లుక్ నాకు చాలా ఇష్టం.
- శివం ఫ్లాప్ తో నిరుత్సాహపడ్డారా ?
అపజయాలు కూడా ముఖ్యమైనవే. మనం వాటి నుంచి మన తప్పులేంటో నేర్చుకోగలుగుతాం. కానీ శివంతో నేను ఆర్టిస్టుగా పరిణతి చెందాను.
-బాలీవుడ్ సంగతులేమన్నా చెబ్తారా?
నేనిప్పుడు హైద్రాబాద్ కి మారిపోయాను. నా దృష్టంతా తెలుగు సినిమాల పైనే. నాకు బాలీవుడ్ వెళ్లిపోవాలనే తొందరేం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చేయడం నాకిష్టం.
- ఈ మధ్య బరువు తగ్గినట్లున్నారు. ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా ?
ఫిట్ గా ఉండడం ముఖ్యం కదా. నా లుక్స్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నా. కాస్ట్యూమ్స్ - పెర్ఫామెన్స్ విషయంలోనూ జాగ్రత్తలు ఎక్కువగా పాటిస్తున్నా. ప్రతీ సినిమాతోనూ ఇంప్రూవ్ అవాలన్నది నా ఆలోచన.
-సాయి ధరం తేజ్ తో సుప్రీం చేస్తున్నారు. ఎలా ఉంది?
నేను చాలా ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా అది. నేను సుప్రీంలో పోలీస్ పాత్ర పోషిస్తున్నా.. అయితే ఈ రోల్ పూర్తిగా కామెడీ టచ్ తోనే ఉంటుంది.