Begin typing your search above and press return to search.

న‌టి కాక‌పోతే కలెక్టర్‌ అయ్యేదాన్ని

By:  Tupaki Desk   |   10 Dec 2015 7:30 AM GMT
న‌టి కాక‌పోతే కలెక్టర్‌ అయ్యేదాన్ని
X
ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తొలి అవ‌కాశం అందుకుంది రాశీ ఖ‌న్నా. ఆరంభ‌మే పెద్ద విజ‌యం అందుకుని వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులొస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న న‌టించిన బెంగాల్ టైగ‌ర్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా రాశీ ఖ‌న్నా త‌న అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు చెప్పిన స‌మాధానాలివి....

* హిందీలో మ‌ద్రాస్ కేఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి, తెలుగులో న‌టించాల‌నుకోవ‌డానికి కార‌ణం?
ప్ర‌త్యేకించి కార‌ణం ఏమీ లేదు. తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చాయి. న‌టిస్తున్నా. అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నా.

*తెలుగు నేర్చుకున్నారా?
ఇక్క‌డికొచ్చాక నేర్చుకున్నా.

* డ్రీమ్ రోల్‌? ఎవ‌రితో చేస్తారు?
డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. క‌ష్టం అనిపించిన పాత్ర నా డ్రీమ్ రోల్‌. అలాంటిది ఇంత‌వ‌ర‌కూ రాలేదు.

*తెలుగు సినీప‌రిశ్ర‌మ‌పై మీ అభిప్రాయం?
ఎంతో న‌చ్చింది.

* న‌చ్చిన స‌హ‌న‌టుడు?
అంద‌రూ న‌చ్చుతారు.

* ప‌వ‌న్ - ఎన్టీఆర్ ల‌తో మీ సినిమాలు ఎప్పుడు?
త్వ‌ర‌లోనే...

*న‌టిగా స్ఫూర్తి ఎవ‌రు?
ర‌వితేజ‌

* సినిమాని ఎంచుకునే ముందు మీ ప్రాధాన్యం దేనికి? క‌థా.. లేక హీరోనా?
రెండిటికీ. ఎంచుకునేప్పుడు పాత్ర గురించి బాగా ఆలోచిస్తాను.

*న‌ట‌న‌లోకి రాకపోయి ఉంటే?
ఐఏఎస్ అయ్యేదానిని.