Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: పక్కా కమర్షియల్ బ్యూటీ ఆరేంజ్ సొగసుల్..!

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:30 AM GMT
ఫోటోస్టోరీ: పక్కా కమర్షియల్ బ్యూటీ ఆరేంజ్ సొగసుల్..!
X
దక్షిణాది చిత్రపరిశ్రమలో ట్రెండ్ మారుతున్నా కొద్దీ బ్యూటిఫుల్ హీరోయిన్స్ గ్లామర్ షోలకు అవధులు లేకుండా పోయాయి. ఇంతకాలం హద్దులు పెట్టుకొని బంధించిన అందాలన్నీ ఒక్కొక్కటిగా టైం చూసి బయట పెడుతున్నారు. సౌత్ ముద్దుగుమ్మలలో ముఖ్యంగా ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా ముందే ఉంటుంది. ఎందుకంటే ఈ వయ్యారి వచ్చింది దేశ రాజధాని నుండే అయినప్పటికీ కొల్లగొడుతుంది మాత్రం తెలుగు కుర్రగుండెలనే అని చెప్పాలి. అమ్మడు ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. బ్యూటీ కేరింగ్ కూడా అంతే. మొదటి నుండి కూడా రాశి అందం తెలుగు కుర్రకారుకు విందులా ఆకట్టుకుంటుంది.

డెబ్యూ మూవీ ఊహలు గుసగుసలాడే మొదలుకొని ఇప్పటివరకు ప్రతిసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం అమ్మడు ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు నెట్టింట అదిరే ఫోటోషూట్స్ తో సెగలు రేపుతోంది. లాక్డౌన్ లో లావుగా కనిపించిన సొగసరి.. వర్కౌట్స్ చేసి నాజూకుగా తయారయ్యింది. అమ్మడికి సోషల్ మీడియా వాడకం బాగా తెలుసు. అందుకే నాజూకు ఒంపుసొంపులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఊరిస్తూ ఉంటుంది. తాజాగా రాశి సోషల్ మీడియాలో పలు క్రేజీ పిక్స్ పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలలో రాశిని చూస్తే.. చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ట్రెండీ ఆరేంజ్ టి-షర్ట్ ధరించి అలా డిఫరెంట్ పోజులలో దర్శనమిచ్చింది. కానీ చూసేవారి కళ్లకు మాత్రం ఇంపుగా కనిపిస్తుంది. అసలే రాశికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటప్పుడు ఫోటోలలో రాశులుగా పొదిగిన అందాలను చూస్తూ ఊరికే వదిలేయలేరుగా.. ఈ హాట్ హాట్ గ్లామర్ బ్యూటీకి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం వయ్యారి చేతిలో పలు తమిళ సినిమాలు ఉన్నాయి. అలాగే తెలుగులో థాంక్యూతో పాటు గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తోంది. అలాగే త్వరలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో ఓటిటి డెబ్యూ చేయబోతుంది.