Begin typing your search above and press return to search.
బాలయ్య పక్కన నటించాల్సిందట కానీ..
By: Tupaki Desk | 15 Nov 2015 11:30 AM GMT‘మనం’ సినిమాలో నిమిషం కనిపించే పాత్రలో నటించి.. ఆపై ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి మాంచి ఫీల్ గుడ్ మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది రాశి ఖన్నా. ఆ తర్వాత జోరు - జిల్ - శివమ్ లాంటి సినిమాలతో సందడి చేసిన ఈ బొద్దుగుమ్మ.. తన తొలి సినిమానే నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో చేయాల్సిందని.. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెబుతోంది. ‘‘చాలామందికి తెలియని సంగతేంటంటే నా మొదటి సినిమాను బాలకృష్ణ గారి పక్కన చేయాల్సింది. కానీ డేట్లు అనుకూలించక, మరికొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు చేయడం కుదర్లేదు’’ అంది రాశి. కానీ తొలి సినిమాకే డేట్లు అనుకూలించకపోవడమేంటో.. అయినా బాలయ్య లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ అంటే ఎలా వదులకుందో అర్థం కావడం లేదు.
ఈ సంగతి వదిలేస్తే.. సీబీఎస్ ఈ 12వ తరగతిలో దిల్లీ సబర్బన్ ఏరియాలో టాపర్ గా నిలిచిన తాను.. సినిమాల్లోకి రావడం అనూహ్యంగా జరిగిందని.. ఇప్పుడు తానున్న స్థితిని ఊహించనే లేని అంటోంది రాశి. హీరోయిన్ గా తన తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ హిట్ కాదేమో అని భయపడ్డానని రాశి చెప్పింది. ‘‘ఆ సినిమా తొలి రోజు షూటింగ్ లో నేను నాగశౌర్యని స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్లాలి. ఆ సీన్లో నేను బ్యాలెన్స్ చేయలేక పడిపోయా. నాకు మూఢ నమ్మకాలు ఎక్కువ. ఇది అపశకునం, సినిమా ఆడదు అనుకున్నా. కానీ ఆ సినిమా మంచి విజయం సాధించి నా భయాన్ని పోగొట్టింది’’ అని రాశి తెలిపింది.