Begin typing your search above and press return to search.

రాశికి ఈసారైనా పని అయ్యేనా..?

By:  Tupaki Desk   |   14 July 2022 3:30 AM GMT
రాశికి ఈసారైనా పని అయ్యేనా..?
X
ఊహలు గుసగుసలాడే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఖన్నా మొదటి సినిమా తోనే నటిగానే మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. రాశి ఖన్నా ఆ తర్వాత కూడా వరుసగా పలు సినిమాల్లో నటించి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. కాని స్టార్ హీరోయిన్‌ గా పెద్ద హీరోలతో నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేక పోయింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం కావస్తున్నా కూడా ఇంకా టాలీవుడ్ లో సరైన సక్సెస్ కోసం.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ అమ్మడిది. హీరోయిన్ గా ఎన్నో సినిమా ల్లో నటించినా కూడా సరైన హిట్స్ మాత్రం ఈ అమ్మడు దక్కించుకోలేక పోయింది. దాంతో అడపా దడపా ఆఫర్లు వచ్చినా మళ్లీ ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సి వస్తుంది.

ఇటీవలే ఈ అమ్మడు పక్కా కమర్షియల్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తో రాశి ఖన్నా కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. దాంతో రాశి ఖన్నా తాజా చిత్రం థాంక్యూ పై నమ్మకం పెట్టుకుంది. నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా లో ఈ అమ్మడు నటించి మెప్పించిన విషయం తెల్సిందే.

థాంక్యూ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో థాంక్యూ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే అయినా రాశి ఖన్నా కు మళ్లీ రెండు మూడు ఆఫర్లు వస్తాయేమో అనే అభిప్రాయం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా నిరాశ పర్చినా కూడా థాంక్యూ విషయంలో రాశి ఖన్నా పాజిటివ్ గా కనిపిస్తుంది.

రాశి ఖన్నా ఈ సినిమా తో కూడా మళ్లీ నిరాశ పర్చితే మాత్రం టాలీవుడ్‌ లో ఆఫర్లకు కష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు లో పెద్దగా చేస్తున్న సినిమాలేమి కూడా చేయడం లేదు. కానీ తమిళంలో మాత్రం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళంలో బిజీగానే ఉన్న ఈమె టాలీవుడ్‌ లో మాత్రం ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.