Begin typing your search above and press return to search.
ఇక్కడ అసౌకర్యంగా లేదులే -రాశి
By: Tupaki Desk | 13 July 2015 5:42 AM GMTఅనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు రాశి ఖన్నా. వరుస విజయాలతో టాలీవుడ్‌లో జెండా పాతేసింది ఈ అమ్మడు. కానీ ఓ మారు గతాన్ని తవ్వితీస్తే ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలు ఈ అమ్మడి జీవితంలో ఉన్నాయి. తొలుత ఈ అమ్మడు ముంబైలోనే అవకాశాలు వెతుక్కుంది. అయితే అక్కడ కెరీర్ పరంగా నిలదొక్కుకోవాలంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదాలు చుట్టూ పొంచి ఉంటాయి.
మోడల్‌గా ఉన్నప్పుడు సినిమా ఛాన్స్ కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. కానీ హైదరాబాద్‌లో అలాంటి సమస్యేం లేదు. టాలీవుడ్ వాతావరణం ముంబై వాతావరణంతో పోలిస్తే అన్నిటికీ అనుకూలం. బాలీవుడ్‌లో ఉన్నంత అసౌకర్యం ఇక్కడ ఉండదు. ఆ స్పీడ్ ఇబ్బంది కలిగించదు. ఇదే విషయాన్ని అనుభవ పూర్వకంగా చెబుతోంది రాశీ. అవును తెలుగులో వెంటనే కుదురుకున్నా. బాలీవుడ్‌లో మద్రాస్ కేఫ్‌లాంటి సినిమాలో అవకాశం దక్కడానికి చాలా కాలమే పట్టింది. అందుకే ముంబైకి భయపడి హైదరాబాద్‌లో కుదురుకున్నా. ఇక్కడ వరుసగా సినిమాలు చేసేస్తున్నా. ఇప్పుడు అన్నిచోట్ల కంటే ఇక్కడే నాకు స్నేహితులు కూడా ఎక్కువ అంటూ చెప్పుకొచ్చింది.
ఊహలు గుసగుసలాడే, జిల్ చిత్రాలతో విజయాలు అందుకున్న ఈ భామ రవితేజ సరసన బెంగాళ్ టైగర్‌లో నటిస్తోంది. రామ్ సరసన హరికథ చిత్రంలో చేస్తోంది. మరిన్ని కథలు వినే పనిలో ఉంది. అయితే కెరీర్ నెమ్మదిగా సాగడానికి కారణం కథల ఎంపికల్లో ఆచితూచి అడుగులేయడం వల్లేనని చెబుతోంది.