Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా ఆ రేంజికి వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   15 May 2016 10:30 PM GMT
రాశి ఖన్నా ఆ రేంజికి వచ్చేసిందా?
X
కెరీర్లో ఇంకా తొలి అడుగులే వేస్తోంది రాశి ఖన్నా. ఆమె స్థాయికి ఇంకా వరుసబెట్టి సినిమాల్ని రిజెక్ట్ చేసేంత సీన్ లేదని అనుకుంటాం. ఐతే తాను మాత్రం ఈ మధ్య కాలంలో పది పన్నెండు సినిమాల్ని రిజెక్ట్ చేశానని చెప్పింది రాశి. పాత్రలు నచ్చకే తాను అలా చేశానని చెప్పింది. ‘‘నా పాత్రలకు ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటా. ఊరికే పాటల్లో కనిపించి వెళ్లిపోవడం నాకిష్టముండదు. ఐతే ఫ్రాంక్ గా చెప్పాలంటే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఈ తరహాలోనే ఉంటాయి. ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ ఉన్నంతలో కాస్త మెరుగ్గా ఉన్న పాత్రల్ని ఎంచుకోవాలని ప్రయత్నిస్తా. ఏ ప్రత్యేకతా లేని పాత్రల్ని తిరస్కరిస్తా. ఇలా పది పన్నెండు సినిమాల దాకా వద్దనుకున్నా’’ అని చెప్పింది రాశి.

అరడజను సినిమాలు చేసిన హీరోయిన్ డజను సినిమాల్ని రిజెక్ట్ చేసే రేంజికి వచ్చేసిందంటే విశేషమే. తనకు టాలీవుడ్ హీరోయిన్లలో అనుష్క అంటే ఇష్టమని.. ఆమె తనకు ఒకరకంగా రోల్ మోడల్ అని రాశి చెప్పింది. ‘‘అనుష్క అద్భుతమైన పాత్రలు చేసింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమెలాగా ప్రత్యేకమైన పాత్రలు చేయాలని నాకూ ఆశ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఆఫర్ చేస్తే తప్పకుండా చేస్తా’’ అని రాశి చెప్పింది. తాను నటించిన హీరోల గురించి ఒక్కో ముక్కలో చెప్పమని రాశిని అడిగితే.. నాగ శౌర్య వెరీ టాలెంటెడ్ అని.. సందీప్ కిషన్ ప్యాషనేట్ అని.. రవితేజ సూపర్ హీరో అని.. రామ్ క్యూట్ బాయ్ అని.. సాయిధరమ్ సుప్రీమ్ అండ్ హార్డ్ వర్కింగ్ అని సెలవిచ్చింది రాశి.