Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు తనకు బాయ్ ఫ్రెండ్ లేడట‌

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:30 AM GMT
ఇప్పటివరకు తనకు బాయ్ ఫ్రెండ్ లేడట‌
X
కెరీర్ ప‌రంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉంది రాశీ ఖ‌న్నా. మూడు భాష‌ల్లో మూడుముక్క‌లాట ఆడుతోంది. తెలుగు- హిందీ- తమిళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన అభిమానులతో సంభాషించడానికి కొంత సమయం తీసుకుంటుంది రాశీ. తాజాగా ఇన్ స్టా లో తన అభిమానులతో ఒక క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్ లో రాశీ తన వ్యక్తిగత విష‌యాల‌తో పాటు కెరీర్ అంశాల‌ను ప్ర‌శ్నించ‌గా.. తాను ఇంకా ఒంటరిగా ఉన్నానని ఇప్పటి వరకు తనకు బాయ్ ఫ్రెండ్ లేడని కూడా ఆమె వెల్లడించింది.

నాకు బోయ్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు క‌చ్ఛితంగా చెబుతాన‌ని రాశీ అంది. జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు -అల్లు అర్జున్ తనకు ఇష్టమైన తెలుగు హీరోలు అని ..సమంత -అనుష్క శెట్టి తనకు ఇష్టమైన తెలుగు నటీమణులు అని ఆమె చెప్పింది. అల్లు అర్జున్ గొప్ప న‌టుడే కాదు గొప్ప డ్యాన్స‌ర్ అంటూ కితాబిచ్క‌చేయ‌డ‌మే గాక త‌న‌తో న‌టించాల‌నుంద‌ని రాశీ వెల్ల‌డించారు.

మలయాళంలో భ్రమం - తమిళంలో అరణ్మనై 3 విడుదల కోసం రాశీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. మరో వైపు తెలుగులో థాంక్యూ - పక్కా కమర్షియల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నాయి. తమిళంలో సర్దార్ .. హిందీలో టైటిల్ నిర్ణ‌యించ‌ని వెబ్ సిరీస్ కోసం షూటింగులు చేస్తోంది.