Begin typing your search above and press return to search.

అయిదో సినిమాకు చేంజ్‌ చూపిస్తా

By:  Tupaki Desk   |   5 Nov 2015 7:30 AM GMT
అయిదో సినిమాకు చేంజ్‌ చూపిస్తా
X
ఆర్నెళ్లు ఆడితో సావాసం చేస్తే ఆళ్లు ఈళ్లు అయ్యార‌ట‌! అని మ‌న పెద్ద‌లు సామ‌త చెబుతుంటారు. తొండ ముదిరితేనే ఊస‌ర‌విల్లు! ఆరంభం ఎవ‌రైనా ఇమేచ్యూర్‌ గానే ఉంటారు. అనుభ‌వాలు బోలెడ‌న్ని పాఠాలు నేర్పిస్తుంటాయి. ఆ జీవిత పాఠాల నుంచే బిహేవియ‌ర్ వ‌స్తుంది.

అందాల స‌మంత‌ - మిల్కీ త‌మ‌న్న - స‌న్న‌జాజి ఇలియానా వీళ్లంతా కెరీర్ ప్రారంభించేప్ప‌టికే మెచ్యూర్డ్‌ గా పాఠాలు నేర్చుకుని రాలేదు. ఓన‌మాలైనా స‌రిగా రాకుండానే తొలి అడుగులు వేశారు. అయితే కాలం బోలెడంత నేర్పించింది. హీరోలు - ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు - సంగీత ద‌ర్శ‌కుల‌తో స్నేహాలు ఇవ‌న్నీ ఎంతో ప‌రిణ‌తిని నేర్పించాయి. ఇకపోతే యంగ్‌ బ్యూటి రాశీఖ‌న్నా విషయంలో వినిపించే క్రిటిసిజం ఇప్పుడు హాట్ టాపిక్‌ అయ్యింది. చిన్న హీరోల‌తో ఏం నేర్చుకోలేదు. పెద్ద స్టార్లు త‌గిలితేనే నేర్చుకుంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీని గురించి రాశి ఏమంటుందో తెలుసా?

నిజానికి రాశీ అంత వ‌ర్రీ అవ్వాల్సిన పొజిష‌న్‌ లో లేదు. ''నాలుగైదు సినిమాల‌కే ప‌రిణ‌తి వ‌చ్చేసింద‌ని భావించ‌డం లేదు. ఆల్వేస్ నేర్చుకుంటా కాబ‌ట్టి పెద్ద హీరోలే నేర్పించాల్సిన ప‌నిలేదు అన్న కాన్ఫిడెన్సు చూపిస్తోంది. ఒక‌టో సినిమాకి మాట్లాడిన‌ట్టు ఐదో సినిమాకి మాట్లాడనుగా..'' అంటూ టీజ్ చేస్తోంది. 5వ సినిమాకు ఏదో చేంజ్‌ చూపిస్తుందట. ఇప్ప‌టికే ప‌రిణ‌తి వ‌చ్చింది బాబూ.. ముందు ముందు మీరే చూస్తారుగా .. అంటూ క‌న్నుగీటుతోంది ఈ ఢిల్లీ డాళ్‌. త్వరలో రిలీజ్‌ కానున్న బెంగాళ్‌ టైగర్‌ లో అమ్మడు కూడా ఓ హీరోయిన్‌.