Begin typing your search above and press return to search.
అప్పుడే హైదరాబాద్ లో ఇల్లు కట్టేస్తోంది
By: Tupaki Desk | 24 Nov 2015 4:35 AM GMTవృత్తిగతమైన ఒత్తిళ్లతో ఫ్యామిలీకి దూరమైపోయే రోజులివి. కుటంబం ఓచోట, మనం ఓచోట జీవించాల్సిన ధైన్యమైన పరిస్థితి ఉంది. అలాంటి వాతావరణం మన కథానాయికలకు కూడా ఉంటుంది. ముంబై నుంచో - బెంగళూరు నుంచో - ఢిల్లీ నుంచో ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ హోటళ్లలో సుదీర్ఘ కాలం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ గా తప్పని పరిస్థితిలో అలా చేయాల్సి వస్తుంది కానీ, నిజానికి హోటళ్లలో బస చేయడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అదేదో ఆర్టిఫిషియల్ లైఫ్ లా అనిపిస్తుంది. ఓ వైపు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. మరోవైపు సినిమాల తో బిజీ అయిపోయి అన్నీ మర్చిపోవాలి.. ఇలాంటి సన్నివేశం ఉంటుంది కాబట్టే ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంది రాశీ ఖన్నా.
అందుకే హైదరాబాద్ పరిసరాల్లో తనకి నచ్చిన ఓ చోట ఓ స్థలం కొనుక్కుంది. ఇప్పుడు అందులో పూజా కార్యక్రమం చేస్తోంది. అందులో ఓ మంచి ఇల్లు కట్టించుకుని దిగిపోవాలన్నది అమ్మడి ప్లాన్. తనకంటూ ఓ సొంతిల్లు ఉంటే అప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకేచోట ఉండొచ్చు. అందుకే ఈ ప్లాన్. ఈ వారాంతంలోనే పునాది రాయి వేసి పూజా కార్యక్రమం పూర్తి చేయనుందని సమాచారం. రాశీ ఖన్నా ఫాదర్ ఓ బిజినెస్ మేన్. అతడికి హైదరాబాద్ తో చాలా కాలంగా అనుబంధం ఉంది. మదర్ కూడా వచ్చి వెళుతుంటారు. కాబట్టి సిటీ వీళ్లకు కొత్తేమీ కాదు. ఇప్పటికే రాశీ కెరీర్ పరంగా ఢోఖాలేని పొజిషన్ కి చేరుకుంది. అందుకే ఇలా ప్లాన్ చేసిందన్నమాట!