Begin typing your search above and press return to search.

సాయిపల్లవి కాదు.. రాశి ఖన్నా

By:  Tupaki Desk   |   28 Feb 2018 7:01 AM GMT
సాయిపల్లవి కాదు.. రాశి ఖన్నా
X
సాయిపల్లవి టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ.. ఆమె యాటిట్యూడ్ విషయంలో మాత్రం ఇప్పటికే చాలా గుసగుసలు వినిపించాయి. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ షూటింగ్ సందర్భంగా నానితో.. ‘కణం’ చిత్రీకరణ సందర్భంగా నాగశౌర్యతో ఆమెకు విభేదాలు తలెత్తాయని.. ఆమె ప్రవర్తన ఆ ఇద్దరు హీరోలను బాధించిందని చెప్పుకున్నారు. నాగశౌర్య అయితే ఈ విషయంలో ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. మరి ఈ రకమైన ఇబ్బంది వల్లో మరేదైనా కారణముందో తెలియదు కానీ.. దిల్ రాజు తీయబోయే కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ నుంచి సాయిపల్లవిని తప్పించేసినట్లు సమాచారం.

నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న రూపొందించనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. అందులో ఒక కథానాయికగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేతను ఖాయం చేశారు. మరో కథానాయికగా సాయిపల్లవిని అనుకున్నారు కానీ.. ఇప్పుడు మనసు మార్చుకున్నారట. ఆ పాత్రకు ‘తొలి ప్రేమ’తో సత్తా చాటుకున్న రాశి ఖన్నాను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ముందు సాయిపల్లవిని అనుకున్నారట కానీ.. ‘తొలి ప్రేమ’తో రాశి కూడా మంచి పెర్ఫామర్ అని రుజువు చేసుకోవడంతో ఆమెతో వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారట. త్వరలోనే చిత్రీకరణ ఆరంభించుకోనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలన్నది ప్లాన్.