Begin typing your search above and press return to search.

అతణ్ని ఎప్పుడు కలిశానో గుర్తు లేదు-రాశి

By:  Tupaki Desk   |   6 Dec 2015 3:30 PM GMT
అతణ్ని ఎప్పుడు కలిశానో గుర్తు లేదు-రాశి
X
నేనా డేటింగా అంటూ సంతూర్ మమ్మీలా ఆశ్చర్యంగా అడుగుతోంది రాశి ఖన్నా. హీరోయిన్ గా తన తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’లో హీరోగా నటించిన నాగశౌర్యతో డేటింగ్ వార్తల్ని ఆమె కొట్టి పారేసింది. అసలు నాగశౌర్యను చివరగా ఎప్పుడు కలిశానో కూడా తనకు గుర్తు లేదంటూ బడాయి పోయింది బబ్లీ గర్ల్. ‘‘చాలా మంది అడిగారు నాగశౌర్యతో డేటింగ్ చేస్తున్నావటగా అని. మీడియాలో కూడా వార్తలు చూశా. ఐతే ఆ వార్త నిజం కాదు కాబట్టి, నేను స్పందించలేదు. ఇప్పుడు అడిగారు కాబట్టి.. చెబుతున్నా. చివరిసారి తనను ఎప్పుడు కలిశానో కూడా గుర్తు లేదు. దాన్నిబట్టి మా మధ్య ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదు. సింగిల్‌ గా ఉన్నాను. హ్యాపీగా ఉంది’’ అని చెప్పింది రాశి.

రకుల్ ప్రీత్‌ సింగ్ నటించిన హీరోలందరితోనూ తాను సినిమాలు చేస్తుండటం యాదృచ్ఛికంగా జరుగుతోందని.. ఆమె తననేమీ రికమండ్ చేయట్లేదని చెప్పింది రాశి. ‘‘అసలు ఒక హీరోయిన్‌ కి ఇంకో హీరోయిన్ రికమండ్ చేసే పరిస్థితి ఉంటుందా? రకుల్ నాకు మంచి ఫ్రెండే. కాదనడంలేదు. కానీ, రాశీని పెట్టుకోండని ఆమె నిర్మాతలు, దర్శకులకు ఎలా చెప్పగలుగుతుంది? ప్రొఫెషన్ సంగతి పక్కనపెడితే విడిగా మేం చాలా బాగుంటాం. మొన్న బర్త్ డే తనతోనే కలిసి చేసుకున్నా. బాగా ఎంజాయ్ చేశాం. మిగతా హీరోయిన్లతో కూడా నాకు మంచి రిలేషన్ షిప్ ఉంది. బెంగాల్ టైగర్ లో ఇంకో హీరోయిన్ గా చేసిన తమన్నా నన్ను చెల్లెలిలాగా చూసుకుంది’’ అని చెప్పింది రాశి. తెలుగులో ఫుల్ బిజీగా ఉండటంతో పూర్తిగా హైదరాబాదుకి షిఫ్ట్ అయిపోయానని.. ఇంకో ఏడాది లోపు ఇక్కడే సొంత ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నానని చెప్పింది రాశి.