Begin typing your search above and press return to search.
అటు మామ ఇటు పండగ.. భలే చిక్కొచ్చిందే!
By: Tupaki Desk | 9 Dec 2019 7:25 AM GMTఈ డిసెంబర్ రాశి ఖన్నా కెరీర్ కు చాలా కీలకమైన నెల. ఎందుకంటే రాశి ఖన్నా నటించిన రెండు క్రేజీ సినిమాలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. ఆ సినిమాల్లో ఒకటి 'వెంకీమామ' కాగా రెండవది 'ప్రతిరోజూ పండగే'. వెంకీమామ 13 వ తారీఖున రిలీజ్ అవుతుండగా.. 'ప్రతిరోజూ పండగే' 20 వ తేదీన విడుదలవుతోంది. రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తాయని.. తన కెరీర్ తారాజువ్వలా పైకి దూసుకుపోతుందని రాశి భారీ నమ్మకమే పెట్టుకుంది.
అంతా బాగానే ఉంది కానీ వారం గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ విషయంలో రాశికి చిక్కొచ్చిపడింది. రెండు సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వస్తున్నవే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'వెంకీమామ' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక 'ప్రతిరోజూ పండగే' గీతా ఆర్ట్స్ వారి జీఎ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం. రెండు సినిమాల ప్రచారానికి రాశి సమయం కేటాయించాల్సిందే. ఒకవేళ రెండు సినిమాల ప్రచార కార్యక్రమాలు కనుక క్లాష్ అయ్యే పక్షంలో ఒక సినిమా కార్యక్రమానికి హాజరై.. మరో సినిమా మేకర్స్ ను హాజరు కాలేనంటూ బ్రతిమాలుకోక తప్పదు.
అయితే ఇప్పటివరకూ రాశి ఖన్నాకు ఈ సమస్య రాలేదట. రెండు సినిమాలకు సంబంధించిన పనులను ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేస్తోందట. ఎంతైనా ఉత్తరాది భామ కదా. ఆ మాత్రం తెలివితేటలు సహజంగానే ఉంటాయి. రెండు సినిమాలేం ఖర్మ.. మూడు సినిమాలు కూడా అవలీలగా లాగిస్తుందేమో.