Begin typing your search above and press return to search.

500కోట్ల ప‌రువు న‌ష్టం కేసులో స్టార్ హీరోకి యూట్యూబ‌ర్ రివ‌ర్స్ వార్నింగ్

By:  Tupaki Desk   |   21 Nov 2020 8:31 AM GMT
500కోట్ల ప‌రువు న‌ష్టం కేసులో స్టార్ హీరోకి యూట్యూబ‌ర్ రివ‌ర్స్ వార్నింగ్
X
అక్షయ్ కుమార్ రూ .500 కోట్ల పరువు నష్టం నోటీసును యూట్యూబర్ సిద్దిఖీ వ్యతిరేకించాడు. తన వీడియోలలో పరువు నష్టం ఏమీ లేదని వాదించాడు. నోటీసును ఉపసంహరించుకోవాలని అక్షయ్ కుమార్ ను సిద్దిఖీ కోరారు. విఫలమైతే అతను నటుడిపై తగిన చట్టపరమైన చర్యలను తీసుకుంటాన‌ని ఎదురు హెచ్చ‌రించాడు.

రాజ్‌పుత్ మరణ కేసులో తనపై తప్పుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ క‌థ‌నం వేసినందుకు సిద్దిఖీపై రూ .500 కోట్ల నష్టపరిహారం కోరుతూ నవంబర్ 17 న అక్ష‌య్ పరువు నష్టం నోటీసు జారీ చేశారు.
న్యాయ సంస్థ ఐసి లీగల్ ద్వారా పంపిన నోటీసుల, సిద్దిఖీ తన యూట్యూబ్ ఛానల్ ఎఫ్.ఎఫ్‌ న్యూస్ లో అనేక ``పరువు నష్టం కలిగించే అవమానకరమైన వీడియోలను ప్రచురించార``ని అక్ష‌య్ కుమార్ ఆవేద‌న చెందారు.

అయితే సిద్ధిఖీ శుక్రవారం తన న్యాయవాది జె పి జైస్వాల్ ద్వారా పంపిన సమాధానంలో.. అక్షయ్ కుమార్ చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోప‌ణ‌లు అని అణచివేత ధోర‌ణితో కూడుకున్న వేధించే ఉద్దేశ్యంతో ఉన్న ఆరోప‌ణ‌లు అని ప్ర‌తివాద‌న వినిపించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సిద్దిఖీతో సహా పలువురు స్వతంత్ర విలేకరులు ఈ వార్తలను కవర్ చేశారు. చాలా మంది ప్రభావవంతమైన మీడియా వ్యక్తులు క‌థ‌నాలు ప్ర‌చురించారు. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇతర ప్రముఖ మీడియా ఛానెల్ లు సరైన సమాచారం ఇవ్వడం లేద‌ని సిద్ధిఖీ ఆరోపించారు.

ప్రతి భారతీయ పౌరుడికి వాక్ స్వేచ్ఛకు ప్రాథమిక హక్కు ఉందని వ్యాఖ్యానించారు. సిద్దిఖీ అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను పరువు నష్టం కలిగించేదిగా పరిగణించలేమని వాటిని నిష్పాక్షికతతో దృక్కోణాలుగా పరిగణించాలని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు.

``సిద్దిఖీ నివేదించిన వార్తలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉన్నాయి అతను (సిద్దిఖీ) ఇతర వార్తా మార్గాలపై ఆధారప‌డిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్థావించారు``. అక్ష‌య్ పంపిన పరువు నష్టం నోటీసు ఆలస్యాన్ని ఇది మరింత ప్రశ్నించింది. 2020 ఆగస్టులో వీడియోలను అప్‌లోడ్ చేస్తే ఇప్పుడు ప్ర‌శ్నిస్తారా? అన్న ప్ర‌శ్న ఎదురైంది. 500 కోట్ల రూపాయల నష్టం అసంబద్ధమైనది అవాంఛనీయమైనది. సిద్దికీపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారంటూ లాయ‌ర్ వాదించారు.

ముంబై పోలీసులు.. మహారాష్ట్ర ప్రభుత్వం .. మంత్రి ఆదిత్య ఠాక్రేపై చేసిన పోస్టులపై పరువు నష్టం.. బహిరంగ దుశ్చర్య ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణలపై ముంబై పోలీసులు సిద్దికీపై కేసు నమోదు చేశారు. అయితే నవంబర్ 3 న ఇక్కడ స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో సహకరించమని కోర్టు ఆదేశించింది.