Begin typing your search above and press return to search.

పెళ్ళికి మీ సలహాలు అవసరం లేదు

By:  Tupaki Desk   |   21 Jun 2018 4:28 AM GMT
పెళ్ళికి మీ సలహాలు అవసరం లేదు
X
వాళ్లిద్దరూ లవర్స్ అనే రూమర్ ఎప్పటి నుంచో ఉంది. తెరపై కనిపించినప్పుడు దాదాపు లవర్స్ లాగే కనిపిస్తారు. దాదాపు అలాగే బిహేవ్ చేస్తారు. నిజంగా పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి కొడుకు.. పెళ్లికూతురు గెటప్ లో ఓ ప్రోగ్రాంలో జంటగా కనిపించారు. వాళ్లే జబర్దస్త్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్ - సుడిగాలి సుధీర్. వీళ్లను నిజజీవితంలోనూ జంట కమ్మని కోరిన ఓ నెటిజన్ కు రష్మి మైండ్ బ్లాకయ్యే రేంజిలో ఆన్సరిచ్చింది.

రష్మి - సుధీర్ చూడచక్కని జంట అని.. మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఓ అభిమాని రష్మికి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసి చిర్రెత్తుకొచ్చిందో ఏమో రష్మి చాలా ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ‘‘మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విషయం నీకెలా తెలుసు? స్క్రీన్ పై మేము కనిపిస్తున్న తీరును బట్టి అలా అనుకుంటారంతే. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే రీల్ లైఫ్ వేరు.. రియల్ లైప్ వేరు. స్క్రీన్ పై కనిపించేదంతా ఆడియన్స్ ని ఎంటర్ టెయిన్ చేయడానికి. ఇక పెళ్లి అంటారా మాకు సంబంధించిన విషయం. ఇందులో మీ సలహాలేమీ అవసరం లేదు’’ అంటూ రష్మి ట్వీట్ చేసింది.

యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో రష్మి సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఆమె చేసిన సినిమాల్లో గుంటూరు టాకీస్ లో చాలా హాట్ గా కనిపించింది. యాంకరింగ్ అండ్ యాక్టింగ్ లోనే కాదు... ఉచిత సలహాకు రిటార్ట్ ఇవ్వడంలోనూ రష్మి టూ హాట్ గురూ!!