Begin typing your search above and press return to search.
చేయాల్సిందంతా చేసి సారీ చెప్పటమా రష్మీ?
By: Tupaki Desk | 20 March 2020 3:00 PM GMTనిజమే.. ప్రజలు పిచ్చోళ్లు. కానీ.. తెలివైన సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు? ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి.. ఆర్థికంగా నష్టపోకూడదన్న కమిట్ మెంట్ తప్పించి.. కాస్తంత బాధ్యతగా వ్యవహరిస్తే రష్మీ ఈరోజు సారీ చెప్పాల్సి వచ్చేది కాదేమో? ఎంతసేపటికి జనాల్ని నాలుగు మాటలు అనేయటం.. వారికి అవగాహన లేదని బాధ పడిపోవటం లాంటివి చేసే బదులు.. అన్ని హంగులు తాను చేసిందేమిటి? అన్న ప్రశ్న వేసుకుంటే మంచిదేమో? కరోనా మీద జనాల్లో సీరియస్ నెస్ లేదని.. అవగాహన తక్కువగా ఉందని చెప్పే బదులు.. తాను చేయాల్సింది చేసి ఉంటే బాగుండేదని చెప్పాలి.
ఇంతకీ..యాంకర్ కమ్ నటి రష్మి సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆమె సారీ చెప్పిన తర్వాత కూడా ఆమె విమర్శలకు గురి అవుతున్నారెందుకు? లాంటి విషయాల్లోకి వెళితే.. ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఒక షోరూం ఓపెనింగ్ కు ఈ రోజు రష్మి వెళ్లారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకున్న పాపులార్టీకి.. రాజమహేంద్రవరం లాంటి చిన్న పట్టణంలో జనాలు ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విడిరోజుల్లో ఇలాంటి వాటికి పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తటం.. తాము అభిమానించే సెలబ్రిటీని కళ్లారా చూశామన్న సంతోషం ప్రజలకు.. ఆమె రాక తో ప్రజలు పోటెత్తిన కారణంగా సదరు షోరూంకు రావాల్సినంత మైలేజీ రావటం.. హైదరాబాద్ నుంచి కష్టపడి ఓపెనింగ్ కు వచ్చినందుకు గాను..తనకు చెల్లించే పారితోషికానికి రష్మిక మేడమ్ హ్యాపీగా ఫీల్ కావటం చూసినప్పుడు..ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆల్ హ్యాపీ అన్నట్లు ఉంటుంది.
కానీ.. ఇప్పుడు కరోనా కోరలు జాచి.. ఎప్పుడేం అవకాశం చిక్కినా.. వ్యాప్తి చెందటానికి ఆబగా ఎదురుచూస్తున్న వేళ.. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ముందుగా కమిట్ మెంట్ ఇచ్చినా.. కరోనా కారణంగా రాలేను.. దీని వల్ల మీకు జరిగే నష్టానికి పరిహారం చెల్లిస్తానన్న పెద్ద మాట ఆమె నోటి నుంచి వచ్చినా.. కరోనా తగ్గిన తర్వాత వచ్చి అదనంగా ఏదైనా కార్యక్రమానికి హాజరవుతానంటే ఏ వాణిజ్య సంస్థ అధినేత కాదనరు.
అలాంటిది వదిలేసి.. ముందుగా కమిట్ మెంట్ ఇచ్చానుకాబట్టి వెళ్లాను. అంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. నా కారణంగా అంతమంది రావటం బాధ కలిగింది. కరోనా మీద ఎవరికి సీరియస్ నెస్ లేదు.. అవగాహన లేదు అని రుసరుసలాడేయటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్న. పోలీసులు పర్మిషన్లు ఇచ్చారని.. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నాకే తాను ఓపెనింగ్ కు వెళ్లినట్లు రష్మి చెబుతున్నా.. అంతగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. రష్మి అసలు వెళ్లేదే కాదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులతో పోలిస్తే.. సెలబ్రిటీలకు సమస్య తీవ్రతకు సంబంధించిన అవగాహన ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు తాను ఓపెనింగ్ కు వెళితే ఎలా పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయం మీద రష్మి కాస్త ఆలోచించినా.. ఇప్పుడు ఆమె సారీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదేమో?