Begin typing your search above and press return to search.

కొత్త హీరోతో డేటింగ్ చేశానన్న రష్మీ

By:  Tupaki Desk   |   28 Feb 2016 7:17 AM GMT
కొత్త హీరోతో డేటింగ్ చేశానన్న రష్మీ
X
గుంటూరు టాకీస్ తో హీరోయిన్ గా మారిన యాంకర్ కం యాక్టర్ రష్మీ.. ఏ రేంజ్ లో కష్టపడిందో ప్రోమోలు చూస్తేనే అర్ధమవుతోంది. మార్చి 4న విడుదల కానున్న ఈ మూవీలో.. ఓ రొమాంటిక్ సాంగ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త కుర్రాడు సిద్ధూతో ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయిన రష్మీ.. అందాలు ఆరబోయడంలోనే కాదు.. ఫీలింగ్స్ తో కూడా మత్తెక్కించేసింది. ఇంతగా సిద్ధూతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించందంటే.. వీరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు.

ఇప్పుడీ గుసగుసలన్నీ నిజమేనని తేలిపోయింది. ఆ విషయం స్వయంగా రష్మీనే ఒప్పుకుంది. సిద్ధూతో డేటింగ్ చేసిన మాట వాస్తవమేనంటూ రష్మీ ఓ బాంబ్ పేల్చేసింది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇదేమీ నిజమైన ప్రేమ, డేటింగ్ కాదంట. సినిమా కోసం ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారట. ఈ సాంగ్ కోసం రిహార్సల్ గా ఉండేందుకు.. కాఫీ షాపులు గట్రా కలిసి తిరిగామని కూడా చెప్పింది రష్మీ.

ఇలా ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నాకే 'నీ సొంతం' సాంగ్ చేయడంతో బాగా పండిందని అంటోంది రష్మీ. అయితే ఈ పాట రష్మీ యాక్టింగ్ కి చాలామంది నుంచి ప్రశంసలు వస్తుంటే.. కొంతమంది మాత్రం బాగా పచ్చిగా ఉందని విమర్శిస్తున్నారు. ఇలాంటి వాటిని పట్టించుకోనని తేల్చేసిన రష్మీ.. చివర్లో ఓ చల్లగా ఓ కబురు చెప్పింది. ఆన్ స్క్రీన్ కోసం అవసరమైనంతమేరకు సిద్ధు, తను డేటింగ్ చేసినా.. తామిద్దరం ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పింది రష్మీ.