Begin typing your search above and press return to search.
జబర్దస్త్ భామల్లో ఎవరు రీచ్ అయ్యారంటే?
By: Tupaki Desk | 5 March 2016 11:46 AM GMTఅనసూయ - రష్మీ.. ఈ పేర్లు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. జబర్దస్త్ టీవీ షో తోనే ఇద్దరూ పాపులారిటీ సంపాదించారు. బుల్లితెరపై కూడా అందాలు ఆరబోసేసి స్పెషల్ గుర్తింపు సంపాదించేసుకున్నారు. ఇద్దరికీ సినిమా రంగంలో వెలిగిపోవాలన్న కోరికలు చాలానే ఉన్నాయి. అనుకోకుండా అయినా.. ఇద్దరి సినిమాల దాదాపు ఒకే టైంలో థియేటర్లలోకి వచ్చాయి. మరి ఇద్దరిలో జనాలను ఆకట్టుకున్నది ఎవరో?
నాగ్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనలో ఓ చిన్న రోల్ తో ప్రేక్షకులకు కనిపించినా.. అనసూయ ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మూవీ క్షణం. మంచి డైలాగ్స్ - ఆకట్టుకునే యాక్షన్ - ప్రీక్లైమాక్స్ - క్లైమాక్స్ లలో ఇంపార్టెంట్ రోల్.. అన్నీ ఉన్నా డైరెక్టర్ తెలివితేటలు, హీరో అడివిశేష్ ల ముందు అనసూయ పాత్ర పెద్దగా ఆనలేదనే చెప్పాలి. మరోవైపు రష్మీ గౌతమ్ టార్గెట్ ముందునుంచీ ఒకటే. గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలగాలి. దీనిమీద అమ్మడికి కొన్ని ఫిక్సెడ్ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రష్మీ చేసిన పాత్ర కూడా అలాంటిదే.
సినిమా సంగతి, రిజల్ట్ సంగతి ఎలా ఉంటాయో అప్పుడే చెప్పలేం కానీ.. రష్మీ రోల్ మాత్రం ఆమె ఎవరినైతే టార్గెట్ చేసిందో వాళ్లకు బాగానే కనెక్ట్ అయింది. ఇండస్ట్రీలో డిమాండ్ దేనికి ఎక్కువగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. అనసూయ హిట్టు కొట్టినా, రష్మీ మూవీ యావరేజ్ అనిపించుకున్నా.. అనుకున్న టార్గెట్ ని సాధించుకున్నది మాత్రం రష్మీనే అని చెప్పాల్సిందే.