Begin typing your search above and press return to search.
నెట్టింట యాంకర్ రష్మీ ఫైర్..
By: Tupaki Desk | 1 April 2020 12:30 AM GMTటాలీవుడ్ లో హీరోయిన్ల తో పాటు అదే రేంజ్ లో పేరు సంపాదించుకుంటున్న టీవీ యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ గౌతమ్ మాత్రమే. బుల్లితెర పై తన గ్లామర్ గుప్పిస్తూ విపరీమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. బుల్లితెర నుండి వెండితెరకు పరిచయమైన రష్మీ తన అందాల ఆరబోతకు మాత్రం ఎల్లప్పుడూ రెడీనే అంటుంది. అయితే ఎన్ని సినిమాలు, షోలు చేసినా రష్మీకి గుర్తింపు తెచ్చింది మాత్రం జబర్దస్త్ కామెడీ షోనే. ప్రస్తుతం అమ్మడు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడం తో ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతుంటుంది. అంతేగాక తనను ట్రోల్ చేసిన వాళ్లను కడిగిపారేస్తుంది. బుల్లితెర ఫైర్ బ్రాండ్ గా పేరున్న రష్మీ సోషల్ మీడియాలో మళ్లీ ఫైర్ అయింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా బీద, బలహీన వర్గానికి చెందిన వారు, రోడ్డున జీవించేవారు ఫుడ్ లేక ఆకలి తో అలమటించి పోతున్నారు. అలాంటి పేదవారికి రష్మీ నివసిస్తున్న కమ్యూనిటీ వాళ్లు చపాతీలను సేకరించి పంచారట. ఈ విషయాన్నీ రష్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 'ఆకలితో బాధపడుతున్న పేదలకు చపాతీలు పంచినందుకు మా కమ్యూనిటీ వారికి థాంక్స్..' అంటూ చేసిన ట్వీట్ కి కొందరు రష్మీ గురించి తెలియక కమ్యూనిటీ అంటే కులం అనుకోని కామెంట్స్ చేసారు. ఆ కామెంట్స్ కి స్పందిస్తూ రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. "హే ఫూల్! కమ్యూనిటీ అంటే నువ్వు అనుకునేది కాదు. నేను ఉంటున్న అపార్ట్మెంట్ కమ్యూనిటీ.. నీలాంటోళ్ళు ప్రతిదాన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేస్తుంటారు. అన్నింట్లో నెగటివ్ చూడకండి" అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.