Begin typing your search above and press return to search.
రేష్మి సినిమా.. ఇంకో కాంట్రవర్శీ
By: Tupaki Desk | 8 Aug 2016 9:25 AM GMTలక్షలు కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ కొన్నిసార్లు కొన్ని వివాదాల వల్ల వచ్చేస్తుంది. కొన్ని వివాదాలు అనుకోకుండా పుడతాయి. కొన్ని కావాలని పుట్టిస్తారు. ఎలా మొదలైనా వివాదాల వల్ల కొన్ని సినిమాలకు చాలా మంచే జరుగుతోంది. ఈ మధ్య యాంకర్ టర్న్ డ్ హీరోయిన్ రష్మి గౌతమ్ చేస్తున్న ప్రతి సినిమానూ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. దాని వల్ల పబ్లిసిటీ వస్తోంది. ‘గుంటూరు టాకీస్’ అంచనాల్ని మించి ఆడటానికి వివాదాలే కారణమయ్యాయి. ఆ తర్వాత ‘అంతం’ సినిమా విషయంలోనూ రష్మి ప్రమోషన్లకు రాకపోవడం మీద వివాదం నడిచింది. ఆమె ప్రమోషన్లకు వస్తే వచ్చే ప్రచారం కంటే రాకపోవడం వల్ల తలెత్తిన వివాదం వల్లే పబ్లిసిటీ బాగా వచ్చింది.
ఇప్పుడు రష్మి కొత్త సినిమా ‘చారుశీల’ విషయంలోనూ ఓ వివాదం మొదలైంది. ఈ సినిమా కాపీ అంటూ ఓ నిర్మాత గొంతెత్తుతున్నాడు. తమిళంలో ‘జూలీ గణపతి’ పేరుతో లెజెండరీ డైరెక్టర్ బాలూ మహేంద్ర తీసిన సినిమాను కాపీ కొట్టి ‘చారుశీల’ తెరకెక్కిస్తున్నారని.. ఐతే ఈ సినిమా తెలుగు డబ్బింగ్.. రీమేక్ హక్కులు తన దగ్గర ఉన్నాయని.. కాబట్టి ‘చారుశీల’ దర్శక నిర్మాతల మీద చర్యలు తీసుకోవాలని.. ఆ సినిమాను ఆపేయాలని కూని రెడ్డి శ్రీనివాస్ అనే నిర్మాత ఆరోపిస్తున్నాడు. నమిత లేదా రాశిని హీరోయిన్ గా పెట్టి ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించి.. శూర్పణక.. జూలీ గణపతి అనే టైటిళ్లను కూడా తాను రిజిస్టర్ చేయించానని.. కానీ ‘చారుశీల’ పోస్టర్లు చూస్తుంటే అది ‘జూలీ గణపతి’కి కాపీలాగా అనిపించి దాని నిర్మాతను సంప్రదించే ప్రయత్నం చేశానని.. కానీ వారి నుంచి సమాధానం లేదని.. అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారో కానీ.. దీని వల్ల ‘చారుశీల’కు పబ్లిసిటీ మాత్రం వస్తోంది.