Begin typing your search above and press return to search.

యాంకరమ్మ.. ఎందుకొచ్చిందమ్మా...

By:  Tupaki Desk   |   4 July 2015 5:30 PM GMT
యాంకరమ్మ.. ఎందుకొచ్చిందమ్మా...
X
వెండితెర ఆశలు ఎంతకైనా తెగించేలా చేస్తాయి. అప్పటివరకూ పద్ధతిగా కనిపించినా పెద్ద తెరపై వెలిగిపోవాలన్న ఆశ ఓ పట్టాన నిలవనీయదు. ఫలితం అక్కడికి వెళ్లాక అన్నీ మర్చిపోయే దుస్థితి వచ్చేస్తుంది. ఛాన్స్‌ దొరికినప్పుడే కుమ్మేయాలి అన్న చందంగా వలువలు విప్పి వల్గర్‌గా కనిపిస్తే ఫలితం వేరేగా ఉంటుంది. సరిగ్గా అలాంటి డైలమాలోనే ఐటెమ్‌ భామగా అవతారం ఎత్తి బ్యాడ్‌నేమ్‌ తెచ్చుకుంది బుల్లితెర యాంకర్‌ రేష్మి.

జబర్ధస్త్‌ వంటి పాపులర్‌ రియాలిటీ షోతో తెలుగువారికి పరిచయమైన ఈ భామ వాస్తవానికి సినీ నాయికగా వెలిగిపోవాలని కలలుగంది. కానీ ఇక్కడ అవకాశం, అదృష్టం రెండూ కలిసి రావాలి. ఒక్కోసారి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సొస్తుంది. అలా ఎదురు చూసి చివరికి విసిగిపోయి ప్రయత్నాలు విరమించుకున్న భామలు ఉన్నారు. కానీ రేష్మి ఓ వైపు తెలుగు, తమిళ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకుంటూనే బుల్లితెర యాంకర్‌గా బండి నెట్టుకొస్తోంది.

లేటెస్టుగా ఈ అమ్మడు బస్తీ సినిమాలో ఓ ఐటెమ్‌ నంబర్‌లో నర్తించింది. వేరొక ఐటెమ్‌ భామతో కలిసి రేష్మి తైతక్క ఆడింది. ఆ ప్రత్యేకగీతం తెరకెక్కించిన తీరు, అందులో రేష్మి కనిపించిన పద్ధతి చాలా చీప్‌గా ఉన్నాయంటూ విమర్శలొస్తున్నాయి. జబర్ధస్త్‌ అభిమానులు సైతం దీనిని ఛీప్‌ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అవకాశం దక్కనంత మాత్రాన సహనం చచ్చి ఇలాంటివాటిని ఎంపిక చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అలాంటి తప్పిదం మళ్లీ రేష్మి చేయకూడదని కోరుకుందాం.