Begin typing your search above and press return to search.

రష్మి లుంగీ డాన్స్ అదిరింది

By:  Tupaki Desk   |   5 Aug 2017 9:05 AM GMT
రష్మి లుంగీ డాన్స్ అదిరింది
X
జబర్దస్త్ టి‌వి షోతో మంచి పాపులర్ అయిన యాంకర్ రష్మి ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తోంది. టి‌వి క్వీన్ కితాబుని కూడా సొంతం చేసుకుంది. ఈమె ఇప్పుడు తన అందంతో తెలుగు యూత్ కి పిచ్చి పట్టిస్తుంది. గుంటూరు టాకీస్ హీరోయిన్ గా మారిన రష్మి ఇప్పుడు తన అందాలను తన ఫ్యాషన్ తో మరింత సెక్సీ గా మారుతుంది. ఈ మధ్య ఒక టి‌వి షో లో తన క్రేజీ ఔట్ ఫిట్ తో కవ్వించే డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది.

ఈ షో లో రష్మి ఒక పర్పుల్ ఫ్యాషన్ డ్రెస్స్ వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్స్ స్పెషల్ ఏంటి అంటే పూర్తిగా వెస్ట్రన్ కాదు అలా అని పూర్తిగా దేశి స్టైల్ కూడా కాదు. ఒక పర్పుల్ షర్ట్ వేసుకొని దాని కింద లుంగీ లా అనిపించే ఒక స్కర్ట్ వేసుకొని తన చిందులతో అక్కడ చూసే వారికి మంచి కనులపండుగ చేసింది. మామూలుగా యాంకర్లు ఏదో వింత ఫ్యాషన్ డ్రెస్స్ లు వేసుకొని షో చేస్తూ ఉంటారు. కాని ఇక్కడ ఆ యాంకర్ల ఆచారానికి విరుద్దంగా ఉన్న డ్రెస్స్ వేసిన రష్మి దాన్ని తన అందం తో గొప్పగా మలుచుకుంది.

ఆమె ఈ డ్రెస్స్ గురించు చెబుతూ ఇదే ఇప్పుడు ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్. వెస్ట్రన్ బట్టలకు మన సంప్రదాయాన్ని జోడించి మరో సరికొత్త డిజైన్ చేయడం అనమాట. పోనీ లెండి అది ఏదో ఫ్యాషన్ ఫుజన్ అని చెబుతుంది. వినండి. చూడటానికి బాగుంది కదా చూడండి.