Begin typing your search above and press return to search.
ఏయ్.. రష్మీ వంత పాడుతుందోచ్
By: Tupaki Desk | 7 Feb 2018 5:08 PM GMTఅనసూయ ఎంత గొప్ప పని చేసిందో అందరికీ తెలుసు. ఓ స్కూలు పిల్లాడు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే చేతిలోంచి ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టింది. పిల్లాడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం కాస్త బయటికి వచ్చింది. అయితే ఈ విషయంలో రష్మి... అనసూయను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతోంది.
అనసూయ పిల్లాడి ఫోన్ పగలగొట్టడం ఆమె అభిమానులే కాదు.. నెటిజన్లంతా విరుచుకుపడుతున్నారు. ఆమెను ఫేస్ బుక్ లో - ట్విట్టర్ లో - ఇన్ స్ట్రాగ్రామ్ లో నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. కొందరైతే తిట్లు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అవి తట్టుకోలేక అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలన్నీ మూసేసింది. దీంతో నెటిజన్లంతా ఆమె ఫ్రెండ్ , యాంకర్ అయిన రష్మిని టార్గెట్ చేశారు. మీరైనా మీ ఫ్రెండుకి చెప్పొచ్చుగా పబ్లిక్ తో ఎలా బిహేవ్ చేయాలో అని పోస్టు పెట్టారు. దానికి రష్మి ‘నేను ఆమె గార్డియన్ కాదు’అని సమాధానం ఇచ్చింది. అంతేకాదు తన ఫ్రెండును వెనకేసుకుని వచ్చింది.
‘నాకు ఆమె బాగా తెలుసు. మా ఇద్దరిలో ఆమె కన్నా నేనే చాలా కఠినంగా ఉంటాను. ఎవరికీ సెల్ఫీలు ఇవ్వడానికి ఇష్టపడను. కానీ అనసూయ అలా కాదు. సెల్ఫీలకు సహకరిస్తుంది. ఆమె తన తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆమె ఫోను లాగి కింద పడేసే పని చేసుండదు’ అని పోస్టు పెట్టింది.
ఒక్కోసారి తనకు భయమేస్తూ ఉంటుందని, కొందరు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన కారును ఫాలో అవుతుంటారని చెప్పింది. అంత వేగంగా వెళుతుంటే వారికేమైనా జరుగుతుందేమోనని భయం వేస్తుందని తెలిపింది. అంతేకాదు అలాంటివారిపై అసలు కంప్లయింట్ కూడా ఇవ్వకుండా తన ఉదారత చాటుకుందట.