Begin typing your search above and press return to search.

వైజాగ్ రాజ‌ధాని.. వైజాగ్ టాలీవుడ్ కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   31 Jan 2020 8:46 AM GMT
వైజాగ్ రాజ‌ధాని.. వైజాగ్ టాలీవుడ్ కావాల‌ట‌!
X
అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా విశాఖ‌ట్ట‌ణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినీ ప‌రిశ్ర‌మ‌కు విశాఖ అనుకూల ప్రాంత‌మైన నేప‌థ్యంలో ఇక్కడా టాలీవుడ్ డెవ‌ల‌ప్ చేయాల‌ని సినిమా పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి ఈ విష‌యంపై మాట్లాడాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ప‌ర్యాట‌క శాఖ‌ మంత్రి.. కాబోయే సినిమాటోగ్ర‌ఫీ మంత్రి ముత్తంశెటి శ్రీనివాస‌రావు విశాఖ‌ని సినీ పెద్ద‌ల చేతుల్లో పెడ‌తాం.. భూములు కేటాయిస్తా.. క‌లిసి అభివృద్ది చేస్తాం! అంటూ ప్ర‌క‌టించ‌డంతో సీన్ మ‌రింత వేడెక్కింది.

వైజాగ్ లో చాలా మంది సెల‌బ్రిటీల‌కు స్థ‌లాలు క‌లిగి ఉండ‌టంతో రాజ‌ధానిని చేసి అభివృద్ది చేస్తే దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా న‌టి క‌మ్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ కూడా విశాఖ అభివృద్ధికే ఓటేసింది. కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోన్న స్చ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2020 లో విశాఖ న‌గ‌రం కూడా పోటీ బ‌రిలో ఉంది. దీనిలో భాగంగా ర‌ష్మి మ‌న విశాఖ‌నే స్వ‌చ్ఛ సిటీగా నెంబ‌ర్1 అవ్వాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. అంద‌రూ విశాఖ‌కు ఓటు వేసి మ‌న న‌గ‌రాన్ని నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బెట్టి విశ్వవ్యాప్తం చేద్దాం అంటూ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా విశాఖ‌కే ఓటు వేయాల‌ని ర‌ష్మీ గౌత‌మ్ కోరింది. 2020 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ పోటీ బ‌రిలో దాదాపు 4370 సుంద‌ర‌ న‌గ‌రాలు పోటీ ప‌డుతున్నాయి. రాజ‌ధాని భూమ్ నేప‌థ్యం...టాలీవుడ్ ని డెవ‌లెప్ చేయాల‌ని స‌న్నాహాకాల్లో ఉన్న నేప‌థ్యంలో విశాఖ‌న‌గ‌రానికే ఎక్కువ‌గా ఓట్లు ప‌డుతున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు పాల్గొన‌డం విశేషం. ఉత్త‌రాంధ్ర‌-రాయ‌ల‌సీమ జిల్లాలు మొత్తం ఉక్కు న‌గ‌రానికే ఓటేస్తున్నారు. విశాఖ ఇప్ప‌టికే స్మార్ట్ సిటీగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.