Begin typing your search above and press return to search.

పీరియడ్స్‌ సమస్య ఉన్నా ఆమె గ్రేట్‌ : రష్మీ

By:  Tupaki Desk   |   18 April 2019 5:14 AM GMT
పీరియడ్స్‌ సమస్య ఉన్నా ఆమె గ్రేట్‌ : రష్మీ
X
జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలతో పాటు, సామాజిక అంశాల గురించి, గొప్ప వారి గురించి ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ హాట్‌ యాంకర్‌ ఇండియాలోనే మొట్ట మొదటి ట్రక్‌ డ్రైవర్‌ గా పేరు దక్కించుకున్న యోగితా రఘువంశీ గురించి ట్వీట్‌ చేసింది. భోపాల్‌ కు చెందిన యోగితా 49 ఏళ్ల వయస్సు మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాంటి మహిళ ట్రక్‌ డ్రైవింగ్‌ చేయడంపై ప్రశంసలు కురిపించింది రష్మి. మిమ్ముల్ని చూస్తుంటే మహిళ లోకం గర్వపడుతుంది. ఇలాంటి కష్టమైన పనుల్లో రాణిస్తున్న మీకు సెల్యూట్‌ చేస్తున్నాను అంటూ రష్మి ట్విట్టర్‌ లో పేర్కొంది.

రష్మి ఏ ట్వీట్‌ చేసిన కొందరు పని గట్టుకుని, ఆమె దృష్టిలో పడాలనే ఉద్దేశ్యంతో ట్రోల్‌ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోస్ట్‌ పై కూడా రష్మి ట్రోల్స్‌ ను ఎదుర్కొంది. ఒక నెటిజన్‌ రష్మి పోస్ట్‌ కు స్పందిస్తూ... ఎన్నో దశాబ్దాలుగా పురుషులు ట్రక్‌ డ్రైవ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలు ఈ పని చేయడంలో గొప్పతనం ఏముంది అంటూ ప్రశ్నించాడు. అతడి వ్యాఖ్యలకు రష్మి కాస్త సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే పీరియడ్స్‌ సమస్య, అలాంటి సమస్యలను ఎదుర్కొని ట్రక్‌ డ్రైవింగ్‌ చేయడం అంటే చాలా పెద్ద విషయం. సరైన సానిటేషన్‌ లేని మన దేశంలో యోగితా లాంటి వారు ఇలాంటి పనులు చేయడం చాలా గొప్ప విషయం. రోడ్డు పక్కన కనీసం మూత్ర విసర్జనకు కూడా సరైన సదుపాయాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ట్రక్‌ డ్రైవింగ్‌ చేయడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయమే అంటూ చెప్పుకొచ్చింది.

రష్మీ వ్యాఖ్యలకు మరోసారి అతడు స్పందిస్తూ.. అది బయోలజికల్‌ సమస్య, అయినా దానికి పరిష్కారం ఉంది. సానిటరీ పాడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. మగాళ్లకు కొన్ని సమస్యలు ఉంటాయి. ట్రక్‌ డ్రైవింగ్‌ అనేది కఠినమైన ఉద్యోగమే. అది పురుషులు మరియు స్త్రీలకు ఇద్దరికి కూడా కఠినమైనదే. అందుకే ఇద్దరిని కూడా అభినందించాల్సిందే అన్నాడు. రష్మీ అతడికి సమాధానంగా పాడ్స్‌ అనేవి పురుషులకు అవసరం లేదు. ట్రక్‌ నడపడం అనే విషయంలో లింగ సమానత్వం పాటించాల్సిందే. కాని మొదటి నుండి కూడా ట్రక్‌ అనేది పురుషులతో నడుపబడుతుంది. ఇప్పుడు యోగిత నడుపుతున్నారు కనుక ఆమెను అభినందిస్తున్నాను అంటూ అతడితో వాదనకు రష్మీ ఫుల్‌ స్టాప్‌ పెట్టింది.