Begin typing your search above and press return to search.
రేషన్ అడిగి లిక్కర్ కోసం లైన్ కట్టారు.. ఆశ్చర్యం!
By: Tupaki Desk | 7 May 2020 12:30 AM GMTప్రస్తుతం దేశంలో లిక్కర్ లొల్లి వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైన్ షాపుల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. ఇన్నిరోజులు మందు కోసం నీరసించిన గొంతులను తనివితీరా తడుపుతున్నారు. అయితే మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడంపై కొంత మంది సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మరింత వ్యాప్తి చెందడానికి ఇది కారణం అవుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ సెలబ్రిటీ యాంకర్ రష్మి గౌతమ్ ఈ విషయం పై ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఉచిత రేషన్ కోసం అభ్యర్థించిన ఈ పేదవారు ఇప్పుడు ఆల్కహాల్ కోసం డబ్బులను సర్దుబాటు చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అంటూ రష్మి కౌంటర్ వేసింది. ‘‘మే 4 తరవాత లిక్కర్ షాప్‌లకు వస్తోన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో మాదిరిగా చెరిగిపోని ఇంక్‌తో మార్కింగ్ వేయాలి.
ఇలాంటి వ్యక్తులు ఉచిత ఆహారానికి కానీ, ప్రభుత్వం ద్వారా అందుతోన్న ఉచిత సరుకులకు కానీ అర్హులు కాదు. వారి రేషన్‌ను కూడా ఆపేయాలి. మద్యం కొనుగోలు చేయడానికి అతని వద్ద డబ్బు ఉన్నప్పుడు, ఉచితాలు ఎందుకు ఇవ్వాలి?’’ అంటూ రష్మి మండిపడింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిందించడం పరిష్కారం కాదని రష్మి చెప్పింది. అన్ని వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని, నిరంతర లాక్‌డౌన్ వల్ల ఒక దేశం మనుగడ సాగించలేదని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం పరిస్థితిని అర్థం చేసుకుని మెలగాలని తెలిపింది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. జోన్ల విభజన అనంతరం మద్యం సమస్య ఒకటే చూడొద్దని రష్మి అభిప్రాయపడ్డారు. ఇళ్లలో సాయం, పనిమనుషులు తిరిగి రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అయితే, వృద్ధులు మినహా అన్నీ బాగానే ఉన్నవారు ఇంకొంతకాలం పని చేసుకోలేరా అని ప్రశ్నించింది. ప్రస్తుతం రష్మీ మాట్లాడింది కూడా నిజమే కదా అన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.