Begin typing your search above and press return to search.

నీలి రంగు ఓణీలోన.. నెరజాణ

By:  Tupaki Desk   |   23 Sep 2015 1:30 PM GMT
నీలి రంగు ఓణీలోన.. నెరజాణ
X
మొదట తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చిన్న రోల్స్ తో సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్న రష్మీ గౌతం.. తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది. ఈ క్రేజ్ ను ఉపయోగించుకుని మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోవాలన్నది ఈమె ఆలోచన. మధ్య మధ్యలో ఫోటో షూట్ లతో అదరగొడుతూ ఉంటుంది రష్మి. బ్లూకలర్ లంగా ఓణీతో ఇచ్చిన లుక్ అదే.

ఈ హాఫ్ శారీ డ్రస్ కి చాలా ప్రత్యేకమైనది. ఎక్కడ చూపించాలో, ఎక్కడ దాచిపెట్టాలో పక్కాగా తెలిసిన కట్టు ఇది. చూపించాలనే ఉద్దేశ్యంతో లంగా ఓణీ ధరిస్తే.. అందులోనూ రష్మీలాంటి సెలబ్రిటీ కనిపిస్తే.. ఆ ఫోజులే వేరుగా ఉంటాయి. నీలి రంగు లంగా, అదే కలర్ చెక్స్ డిజైన్ తో ఓణీ.. ఎలా కట్టాలో నేర్పిస్తున్నా చూడండి అన్నట్లుగా రష్మీ ఇచ్చిన ఫోజులు సూపర్ గా ఉన్నాయి కదూ. ఇఫ్పుడీ జబర్దస్త్ భామ నటించిన గుంటూరు టాకీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ రూపొందించిన మూవీ కావడంతో.. అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

తొలిసారిగా లీడ్ రోల్ లో నటించడంతో... రష్మీ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది విడుదల కోసం. అంతలోనే ఈమెకు చారుశీల అంటూ మరో ఆఫర్ తలుపుతట్టడంతో భలే ఖుషీగా ఉంది రష్మీ. జబర్దస్త్ గా సినిమా ఇండస్ట్రీలో పాగా వేసేయచ్చని భావిస్తోంది. వాటే హాట్‌ నెరజాణ ఎనీవే..