Begin typing your search above and press return to search.
రష్మిలోని ఈ యాంగిల్ చూశారా?
By: Tupaki Desk | 9 Nov 2017 5:58 AM GMTరష్మి గౌతమ్ పేరెత్తగానే బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేయడం ద్వారా పేరు తెచ్చుకున్న అమ్మాయిగానే గుర్తొస్తుంది. అలాగే ‘గుంటూరు టాకీస్’ లాంటి సినిమాల్లో వెండితెర మీదా రెచ్చిపోయిన హీరోయిన్ గానూ ఆమెకు మంచి పేరే వచ్చింది. మొత్తంగా రష్మికి తెలుగు ప్రేక్షకుల్లో ఒక హాట్ ఇమేజ్ వచ్చేసింది. తెరపై తాను కనిపించే రీతిలోనే కాదు.. మాట్లాడటంలోనూ రష్మికి దూకుడు ఎక్కువే. దీంతో ఆమెను ప్రేక్షకులు చూసే కోణమే వేరుగా ఉంటోంది. కానీ రష్మి తనలోని మరో కోణాన్ని చూపించింది ఒక కార్యక్రమంలో. టీవీ.. ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ముందు తాను పడ్డ కష్టాల గురించి రష్మి ఓ టీవీ కార్యక్రమంలో పంచుకుంది.
ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలని కోరితే ఎన్ని కష్టాలైనా పడి తల్లిదండ్రులు లక్షలు లక్షలు ఇస్తారని.. కానీ సినిమాల్లోకి వెళ్తా అంటే మాత్రం పైసా విదల్చరని రష్మి చెప్పింది. తాను నటి కావాలని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసినపుడు తన తల్లిదండ్రులు కూడా ఏ సాయం చేయలేదని.. తాను కూడా వాళ్లను గట్టిగా ఏమీ అడగలేదని రష్మి చెప్పింది. ఇండస్ట్రీలో వెలిగిపోవాలని వచ్చి కష్టాలు పడే అబ్బాయిల్లాగే తాను కూడా ఇబ్బందులు పడ్డట్లు ఆమె వెల్లడించింది. ఆర్థిక సమస్యలతో సతమతమైనట్లు ఆమె తెలిపింది. మాటీవీలో చేసిన ఓ టీవీ కార్యక్రమానికి సంబంధించి తనకు తొలిసారిగా 25 వేల రూపాయల చెక్కు దక్కిందని.. ఆ డబ్బులతో బేసిక్ నీడ్స్ అన్నీ కొనుక్కోవాల్సి వచ్చిందని రష్మి చెప్పింది. తనకంటూ ఓ గుర్తింపు వచ్చేవరకు ఇంటికి వెళ్లకూడదన్న పట్టుదలతో ఏడాది పాటు వైజాగ్ ముఖమే చూడలేదని రష్మి తెలిపింది. టీవీల్లో.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా పెద్దగా పేరు రాలేదని.. ఐతే ‘జబర్దస్త్’ కార్యక్రమం తన కెరీర్ ను మలుపు తిప్పిందని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం తాను సంతృప్తికర జీవితం గడుపుతున్నానని రష్మి తెలిపింది.