Begin typing your search above and press return to search.

అందరితో అంతే క్లోజ్ గా ఉంటా

By:  Tupaki Desk   |   7 Oct 2017 1:30 AM GMT
అందరితో అంతే క్లోజ్ గా ఉంటా
X
ప్రస్తుత రోజుల్లో సినీ తారలు కెరీర్ లో జయాపజయాలను ఎదుర్కొన్నట్లే రూమర్స్ ని ఎదుర్కోవడం కూడా కామన్ అయిపొయింది. ఎటువంటి సెలబ్రెటీలకైనా ఇప్పుడు ఆ తరహా రూమర్స్ చాలానే వస్తున్నాయి. మొన్నటి వరకు సినీ తారల వరకే ఉండే ఈ రూమర్స్ ఇప్పుడు బుల్లి తెరపైకి కూడా వస్తున్నాయి. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా ఆ రూమర్స్ వెలువడడం ఒక్కోసారి అందరిని షాక్ కి గురి చేస్తుంది.

ఈ మధ్య కాలంలో బుల్లి తెర యాంకర్ రష్మిపై ఎక్కువ స్థాయిలో రూమర్స్ వస్తున్నాయి. కమెడియన్ ఆర్టిస్ట్ సుదీర్ తో ఆమె ప్రేమాయణాన్ని కొనసాగిస్తుందని కొన్ని సోషల్ మీడియాలలో కామెంట్స్ వినిపించాయి.కానీ వారి మధ్య అలాంటి వ్యవహారం ఏమి లేదని చెప్పినా కూడా ఇంకా రూమర్స్ బాగానే వచ్చాయి. అయితే రీసెంట్ రష్మీ సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో లైవ్ చాట్ చేసింది. ఆమెను పాజిటివ్ గా కన్నా చాలావరకు నెగిటివ్ ప్రశ్నలనే అడిగారు నెటిజనులు. దీంతో అమ్మడు కొంచెం ఘాటుగానే స్పందించింది.

సుదీర్ ని పెళ్లి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకి రష్మీ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ''ప్రొఫెషనల్ గా మేం మంచి స్నేహితులం. వివిధ షోలలో ఈవెంట్స్ లలో కలిసి చేస్తూ.. ఉంటాం. సుదీర్ నాకు మంచి స్నేహితుడు. ఎదో షూటింగ్ మధ్యలో క్లోజ్ గా ఉంటాం. దానికే ఎదో రిలేషన్ ఉందని పెళ్లి చేసుకుంటారని చెప్పడం ఏమిటి?'' అని మండిపడింది. అంతే కాకుండా ఇతర నటులతో కూడా తాను అంతే క్లోజ్ గా ఉంటానని రష్మీ వివరించింది.