Begin typing your search above and press return to search.

ఒక్కటి కూడా విడుదలవ్వకుండానే రష్మికకు మూడవ ఛాన్స్‌

By:  Tupaki Desk   |   22 Nov 2021 5:22 AM GMT
ఒక్కటి కూడా విడుదలవ్వకుండానే రష్మికకు మూడవ ఛాన్స్‌
X
సౌత్ లో ఇప్పటికే స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్దం అయిన విషయం తెల్సిందే. హిందీలో ఈ అమ్మడు అమితాబచ్చన్ తో ఒక సినిమాలో నటించగా అది విడుదలకు సిద్దం అవుతోంది. అది మాత్రమే కాకుండా మిషన్ మజ్ను అనే సినిమాను కూడా హిందీలో రష్మిక చేసింది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సహజంగా అయితే సినిమాలు విడుదల అయిన తర్వాత ఆ సినిమాలతో వచ్చిన క్రేజ్ తో మరిన్ని ఆఫర్లు వస్తాయి. కాని రష్మిక మందన్న పరిస్థితి వేరుగా ఉంది. బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడవ ఆఫర్‌ ను దక్కించుకుంది.

రష్మిక మందన్న తెలుగు లో నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఆ సినిమా తో ఖచ్చితంగా రష్మిక బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం. అంతే కాకుండా మిషన్ మజ్ను మరియు అమితాబచ్చన్‌ తో నటిస్తున్న సినిమాలు రెండు కూడా బాలీవుడ్‌ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను దక్కించుకుంటే ఆ తర్వాత రష్మిక బాలీవుడ్ లో చాలా బిజీ అవ్వడం ఖాయం. అందుకే ఆమెతో ఇప్పటి నుండే కొందరు ఫిల్మ్‌ మేకర్స్ ఒప్పందం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా రష్మిక మందన్నతో విభిన్న చిత్రాల దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌ చర్చలు జరిపాడట. ముంబయిలోని ఆయన ఆఫీస్ కు వెళ్లిన రష్మిక మందన్నా కథ కూడా విన్నట్లుగా తెలుస్తోంది. ఆయన వచ్చే ఏడాది లో తీయబోతున్న సినిమాకు గాను ఈమెను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలో రష్మిక ఫైనల్‌ అయినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. రష్మిక బాలీవుడ్‌ మూడవ సినిమా గురించి ఒకటి రెండు వారాల్లో అధికారికంగా ప్రకటన వస్తుందేమో చూడాలి. రష్మిక మందన్న పుష్ప సినిమాలో మాత్రమే కాకుండా శర్వానంద్ తో ఒక సినిమాలో నానితో ఒక సినిమాలో కూడా నటిస్తోంది. ఇక తమిళం మరియు కన్నడంలో కూడా ఈ అమ్మడి సినిమాలు కంటిన్యూస్ గా రూపొందుతూనే ఉన్నాయి.