Begin typing your search above and press return to search.
చీరకట్టులో పాలపిట్టలా మెరుస్తున్న రష్మీ
By: Tupaki Desk | 25 Feb 2021 3:30 AM GMTఅందాన్ని చూస్తే ఆరోగ్యం పెరుగుతుంది .. ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుందని సీనియర్లు చాలామంది సెలవిచ్చారు. సముద్రాన్ని చిలికినప్పుడు అప్సరసలు కూడా బయటపడ్డారు. వాళ్ల పిల్లలు కొంతమంది భూలోకానికి విహారానికి వచ్చి, తిరిగి వెళ్లడానికి 'ఉంగరం' లేకపోవడంతో దానిని వెతుకుతూ ఇక్కడే ఉండిపోయారు. ఆ అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అనే సందేహం రావడం సహజం. ఒక అమ్మాయి మాత్రం 'రష్మీ' పేరుతో ఇక్కడిక్కడే తిరుగుతోంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటూ ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతోంది.
అందమంతా చీరకట్టులోనే ఉంటుందని అంటారు. అణువణువునూ అల్లుకుపోవడం .. అందంలోని ఆనందాన్ని ఆవిష్కరించడం చీరకు మాత్రమే తెలుసు. పిల్ల తెమ్మెరకు రెపరెపలాడే చీర .. చిలిపి చినుకులకు సిగ్గుతో ముడుచుకుపోయే చీర ఎంతమంది కుర్రాళ్ల మనసుల్లో అలలా ఎగసిపడి ఉంటుంది? ఎంతమంది ఊహలపై ఉప్పెనలా విరుచుకుపడి ఉంటుంది? అందువల్లనే చీరకట్టుకు ఓట్లు ఎక్కువ పడిపోతాయి .. మిగతా డ్రెస్సులు ఏవైనా దానిముందు ఓడిపోతాయి.
ఈ కామరణంగానేనేమో రష్మీ ఇక్కడ చీరకట్టులో మెరిసింది. వాలుకళ్లతో వయ్యారాలు ఒలకబోస్తోంది. లూజ్ హెయిర్ ను వెనక్కు వదిలేసి, విరహంతో వేగిపోతున్నట్టుగా ఆమె ఇచ్చిన పోజు, మనోఫలకాలపై ఏవో కవితలురాస్తూ వెళుతోంది. వెన్నెల్లో జారిపడిన చందమామలా .. పాలకుండలో పాలపుంతలా అందానికి అర్థం చెబుతోంది. ఊహాసుందరిలా మత్తుకళ్లతో మాయం చేస్తున్న రష్మీని చూసిన కుర్రాళ్లు, కాఫీలు - టిఫిన్లు మరిచిపోయి ఉపవాసాలుండిపోయే అవకాశాలు ఎక్కువే. పాపం రష్మీ మాత్రం ఏం చేస్తుంది? అందానికి ఉన్న అధికారం .. అర్హత అదేకదా?
చాలా కాలంగా రష్మీ బుల్లితెరపై తన జోరు చూపుతూనే వస్తోంది. మధ్య మధ్యలో సినిమాలు కూడా చేసింది. తనే ప్రధానపాత్రగా సాగే సినిమాల్లోను తన ప్రతిభను చాటుకుంది. అయితే ఎందుకో ఈ మధ్య వెండితెరపై కనిపించడం తగ్గింది. అనసూయ మాదిరిగా రష్మీ కూడా తన జోరు పెంచవలసిందేనని అభిమానులు కోరుకుంటున్నారు. మునుపటిలా ఆమె అందాల సందడి చేయవలసిందేనని అభిప్రాయపడుతున్నారు. చూపులతోనే గుండె గుడారాలపై బాంబులు వేసే ఈ పిల్ల ఫిరంగి మనసు మార్చుకుంటుందేమో చూడాలి.