Begin typing your search above and press return to search.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
By: Tupaki Desk | 10 Nov 2017 4:16 AM GMTతన అందచందాలతో యాంకరింగ్ కు కొత్త గ్లామర్ లుక్ తెచ్చినా.. కవ్వించే చూపులు.. పదునైన మాటలు.. అందాల ఆరబోతతో వెండితెరను వేడెక్కించినా అది రష్మీ గౌతమ్ కే చెల్లుతుంది. గుంటూరు టాకీస్ లో సువర్ణగా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన ఈ భామ తాజాగా ఆది హీరోగా నటించిన నెక్ట్స్ నువ్వే లో చీరకట్టుతో కనిపించి చూపులను కట్టిపడేసింది.
టీవీ షో అయినా.. సినిమా అయినా గ్లామర్ డోస్ ఓ రేంజిలో ఒలకబోయడం రష్మీకి మామూలే. ఇదే మాట రష్మీ వద్ద ప్రస్తావిస్తే చాలా ఓపెన్ గా బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ‘‘ఇంకో ఐదేళ్లుపోతే నేను గ్లామర్ పాత్రల్లో నటిస్తానన్నా ఎవరూ చూడరు. లైఫ్ ఈ టైంలోనే సెటిల్ అయిపోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం కమర్షియల్ గా ఉన్నప్పుడు మనమూ అలా ఉండకపోతే బతకలేం. డబ్బు జీవితంలో చాలా ముఖ్యం. ఇండస్ట్రీలో చెప్పే మాటలకు.. తెరపై కనిపించే దానికి చాలా తేడా ఉంటుంది. మంచిరోల్.. సెకండ్ హీరోయిన్ అని చెప్పినా ఆ రోల్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది మెరుపుతీగలా.’’ అంటూ తన మనసులోని మాట చెబుతోంది.
రష్మీ దాదాపు పుష్కర కాలంగానే కెరీర్ ప్రారంభించినా బాగా ఫేమస్ అయింది జబర్దస్త్ షోతోనే. అనసూయను కాదని తనకు ఈ అవకాశం రావడానికి కారణం ఆ టైంలో అనసూయ ప్రెగ్నెంట్ కావడమేనని రష్మీ చెప్పింది. జబర్దస్త్ తర్వాత స్టార్ స్టేటస్ రావడమేకాదు.. సినిమాల్లో చెప్పుకోదగిన రోల్స్ కూడా లభించాయంది. స్క్రిప్టు బాగుంటే చిన్న హీరోలతోనూ సినిమా చేయడానికి ఇబ్బంది ఏ లేదని.. తను చాలా ఫ్లెక్సిబుల్ అంటోంది.