Begin typing your search above and press return to search.

రష్మీ పంచ్ మామూలుగా లేదుగా!!

By:  Tupaki Desk   |   24 Aug 2016 8:51 AM GMT
రష్మీ పంచ్ మామూలుగా లేదుగా!!
X
ఇప్పుడు సినిమాలు.. అందులో హీరోయిన్లు అంటే ఒకరకంగానే ఊహించుకోవాల్సిన పరిస్థితి. హీరోయిన్ ని స్టార్ చేసేసే అరుంధతి లాంటి సినిమాలు వస్తున్నా.. అవి చాలా చాలా తక్కువ. ఆడియన్స్ కూడా ఇలాగే అలవాటు పడిపోయారంటూ.. చేసేవాళ్లు తీసేవాళ్లు కూడా అదే రూట్ లో ఉంటున్నారు. ఈ మధ్యనే హాట్ యాంకర్ నుంచి హాట్ హీరోయిన్ గా మారిన రష్మీకి.. ఓ అభిమాని ఒక సలహా ఇచ్చాడు.

రష్మీ అంటే ఇతనికి ఎంతిష్టమో కానీ.. 'బీ గ్రేడ్ సినిమాల్లో నటించేబదులు మంచి స్టోరీలు ఎంచుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది' అంటూ ఓ ఉచిత సలహా పారేశాడా అభిమాని. దీన్ని కేజువల్ గా తీసుకోవచ్చు కానీ.. ఇలాంటి మాటలను ఇప్పటికి ఎన్నో వినేసి విసుగెత్తిపోయిన రష్మీ.. స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చింది. 'తప్పకుండా.. నువ్వు సినిమా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావో చెప్పు' అంటూ ఆన్సర్ ఇచ్చింది రష్మీ గౌతమ్.

రష్మీ ట్వీట్ లో చాలానే అర్ధాలు వెతికేసుకోవచ్చు. మంచి స్టోరీలతో మంచి పాత్రలతో ఆఫర్స్ ఇచ్చేవాళ్లు కనిపించడం లేదని.. తనకొస్తున్న ఆఫర్స్ అన్నీ అలాంటివే అయినపుడు ఏం చేయాలని.. రష్మీ నిలదీస్తున్నట్లుగా లేదూ!