Begin typing your search above and press return to search.

అనసూయతో గొడవా.. సుధీర్ తో ఎఫైరా?

By:  Tupaki Desk   |   20 Oct 2016 7:30 PM GMT
అనసూయతో గొడవా.. సుధీర్ తో ఎఫైరా?
X
‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో వెలుగులోకి వచ్చిన భామలు అనసూయ.. రష్మి. ముందు అనసూయ ఈ షోతో పాపులర్ అయితే.. ఆ తర్వాత ఆమెను రీప్లేస్ చేసి అంతకంటే ఎక్కువ పేరే సంపాదించింది రష్మి. కాస్త అటు ఇటుగా వీళ్లిద్దరూ ఒకేసారి సినిమాల్లోకి కూడా దూసుకొచ్చారు. అనసూయ ప్రత్యేక పాత్రలైనా సరే కొంచెం పెద్ద స్థాయి సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంటే.. రష్మి మాత్రం చిన్న సినిమాలైనా పర్వాలేదు హీరోయిన్ పాత్రలే చేస్తోంది. ఐతే ఒకే ప్రోగ్రాం ద్వారా వచ్చినవాళ్లు కావడంతో వీళ్ల మధ్య పోటీ.. ఇగోస్ ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య గొడవలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీని గురించి రష్మి దగ్గర ప్రస్తావిస్తే.. నాకా అనసూయతో గొడవలా అంటూ ఆశ్చర్యపోయింది.

‘‘అనసూయతో నాకు ఎలాంటి గొడవలూ లేవు. మేమిద్దరం ఒకే షో నుంచి వచ్చాం కాబట్టి ఇలాంటి రూమర్లు సహజం. మేమిద్దరం మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలం. ఇలాంటివి లైట్ తీసుకుంటాం. మా లక్ష్యాలు వేరు. మా మార్గాలు వేరు. అనసూయ పెద్ద సినిమాల్లో చేస్తోంది. పెద్ద స్టార్లతో నటించింది. నన్ను నేను రాకుమారిలాగా భావిస్తాను. నేనో సినిమా చేశానంటే దాని ద్వారా అందరికీ గుర్తుండిపోవాలి. చిన్న సినిమాలు చేయడానికి నాకు ఇబ్బందేమీ లేదు. అలాగే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు’’ అని రష్మి చెప్పింది. ‘జబర్దస్త్’ కమెడియన్ సుధీర్ తో ఎఫైర్ అన్న రూమర్లపై రష్మి స్పందిస్తూ.. ‘‘ఇలాంటి వార్తలతో యూట్యూబ్ లో.. ఇంటర్నెట్లో ట్రెండవడం మంచిదే. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందేమీ లేదు. అలాంటివి చేస్తూ నన్ను మరింత ఫేమస్ చేయండి. నా రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూనే ఉండండి. దేని గురించైనా చర్చించుకోండి. నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు’’ అని రష్మి తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/