Begin typing your search above and press return to search.
రేప్ పై రష్మీ చేసిన ట్వీట్ వైరల్
By: Tupaki Desk | 4 May 2019 7:55 AM GMTయాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈమె మహిళ సాధికారత మరియు అమ్మాయిలపై అఘాయిత్యాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. తన మనోభావాలను అద్దం పట్టేలా రష్మీ ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. తాజాగా ఈమె రేప్ గురించి ట్వీట్ చేసి మరోసారి చర్చనీయాంశం అయ్యింది. రేప్ గురించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఆమె ట్వీట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్బంగా రష్మీపై విమర్శలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు.
రేప్ లకు కారణం అమ్మాయిలు వేసుకుంటున్న మినీ స్కట్స్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై రష్మీ సీరియస్ అయ్యింది. రేప్ అనే పదం ప్యాన్సీ వర్డ్ కాదు, దాన్ని జోక్ గా వాడవద్దు. అలా జరిగిన సమయంలో ఆడవారు ఎంత క్షోభ అనుభవిస్తారో మాటల్లో చెప్పలేం. మినీ స్కర్ట్ లు రాకముందు నుండే రేప్ లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అంటూ ట్వీట్ చేయడంతో పాటు రేప్ అనేది ముందే వచ్చిందనే ఇమేజ్ ను కూడా పోస్ట్ చేసింది.
రష్మీ ట్వీట్ పై పలువురు ప్రశంసలు కురిపించారు. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం, రేప్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుండో ఉన్నది. అందుకే ఆడవారి డ్రస్ ల వల్ల రేప్ లు జరుగుతున్నాయని ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని రష్మీ ట్వీట్ ను అభినందిస్తూ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. రేప్ లు ఆడవారు వేసుకునే డ్రస్ ల వల్లే జరుగుతున్నాయని అనుకునే వారికి మీ ట్వీట్ కనువిప్పు. ఇకపై అయినా వారు ఈ విషయమై మాట్లాడకుండా ఉంటారని ఆశిద్దాం.
ఇదే సమయంలో రష్మీ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఇలా చేయడం స్వాతంత్య్రం అనుకుంది, కానీ దీని వల్ల తనకు ఉన్న సహజ భద్రతను కోల్పోతుందని తెలుసుకోలేక పోయింది, ఇదే విధంగా అమ్మాయిలు కూడా అంటూ ఒక తాబేలు ఫొటోను వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ తాబేలు తన సహజ రక్షణ కవచం నుండి బయటకు వచ్చి ఉంది.
ఇలా రష్మీ రేప్ వ్యాఖ్యలపై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం అయితే రష్మీని అభినందిస్తూ, ఆమె సామాజిక సృహతో చేసిన ట్వీట్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.