Begin typing your search above and press return to search.
రష్మీ సెటిల్ అయ్యేది అక్కడేనట
By: Tupaki Desk | 12 Jun 2017 4:30 PM GMTయాంకర్ గా మొదలెట్టి.. హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న వారు చాలా తక్కువమందే అని చెప్పాలి. అందునా తెలుగులో అలాంటి ఇమేజ్ సంపాదించినోళ్లను గుర్తు చేసుకుంటే తొలుత గుర్తుకు వచ్చేది "జబర్ద స్త్" రష్మీనే. అమ్మడి ఇమేజ్ ఎంతవరకూ వెళ్లిందంటే.. ఎప్పుడో డబ్బాల్లో పెట్టేసి.. సర్దేసుకున్న ఫిలింరీళ్లను బయటకు తీసి.. దుమ్ము దులిపి సరికొత్తగా ప్రజంట్ చేసి సొమ్ము చేసుకునేలా చేయటంలో ఆమె ఇమేజ్ చాలానే సాయం చేసిందని చెప్పాలి.
రష్మీలో మరో ఆసక్తికర కోణం ఏమిటంటే.. హీరోయిన్ గా బడ్జెట్ సినిమాల్లో చేసినా.. తానో హీరోయిన్ అన్న పొగరు ఎక్కడా ప్రదర్శించకుండా.. తనకింత ఇమేజ్ తెచ్చి పెట్టిన షోలను యథావిధిగా చేసుకుంటూ ఉంటుంది. పనిలో పనిగా మధ్య మధ్యలో వచ్చే ఓపెనింగ్స్ కు వెళ్లి..దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటుంది.
తాజాగా అమ్మడు విశాఖలో ఏర్పాటు చేసిన ఒక స్వీట్ షాపు ఓపెనింగ్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా రష్మీని చూసేందుకు జనాలు ఓ రేంజ్లో విరగబడ్డారు. షాపు ఓపెనింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రష్మీ.. తాను తాజాగా నటించిన సినిమా గురించి విశేషాలు చెప్పుకొచ్చారు.
ఆది సరసన నటించిన చిత్రం త్వరలోనే విడుదల కానుందన్నారు. ఇప్పటికిప్పుడు కాకున్నా.. ఫ్యూచర్ లో తాను సెటిల్ అయ్యే సిటీ విశాఖపట్నమేనని.. ఆ విషయంలో తానెప్పుడో డిసైడ్ అయిపోనట్లుగా చెప్పేసింది. మొత్తానికి తన మాటలతో వైజాగ్ వాసుల మనసుల్ని దోచేసుకుందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. వైజాగ్ లో సెటిల్ అవుతానన్న రష్మీ మాటలపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. వైజాగ్ సెటిల్ కావటం అంటే.. ఆ నగరానికి చెందిన వారితో ఏమైనా పెళ్లి ఫిక్స్ కానుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/