Begin typing your search above and press return to search.

ఛాన్స్ దొరికితే రష్మి మీద చేతులే

By:  Tupaki Desk   |   19 Oct 2016 9:30 AM GMT
ఛాన్స్ దొరికితే రష్మి మీద చేతులే
X
ఒక టివి ప్రోగ్రామ్ ను రక్తి కట్టించాలంటే.. అందులో కేవలం నవ్వులు పువ్వులూ మాస్ మసాలా ఉంటే సరిపోదు. అందులో కొన్ని కొట్లాటలు.. గొడవలు.. పైటింగులూ.. ఏడుపు పెడబొబ్బులూ కూడా పెట్టాలి. ఈ విషయంలో మనం థ్యాంక్స్ టు ఓంకార్ అన్నయ్య అని చెప్పుకోవాల్సిందే. దెబ్బకి తెలుగు ప్రోగ్రామ్స్ జరిగే తీరును మార్చిపాడేశాడు. అదిగో అందుకే ప్రతీ చిన్న విషయాన్నీ మనోళ్లు భారీ గాసిప్ రేంజులో ప్రెజంటేషన్ ఇస్తున్నారు.

యాంకర్ గా రష్మి ఫుల్లు బిజీ. అమ్మడు టివిల్లో కూడా తన అందాలతో మెరుపులు మెరిపిస్తూ మాటలతో వాయిస్తుంటుంది. అయతే ఈ మధ్యనే ఎవరితోనైతే తనకు ఎఫైర్ ఉందని అంటున్నారో.. ఆ సుడిగాలి సుధీర్ తో అమ్మడు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లో చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ కొత్త ప్రోమో చూసిన వారెవ్వరైనా కూడా.. వామ్మో ఏదో జరిగింది అనుకోకుండా ఉండలేరు. మాట్లాడుతూ మాట్లాడుతూ రష్మి మీద చెయ్యేశాడు సుధీర్. వెంటనే రష్మి రియాక్షన్ ఏంటంటే.. ''చెయ్యి తియ్. ఛాన్స్ దొరికితే చాలా మీద చేతులు వేసేయడమే'' అనేసింది. ఆ తరువాత ఇద్దరూ నవ్వుకున్నారు. సుధీర్ సిగ్గుపడ్డాడులే. ఇదంతా ఈ బుధవారం (అక్టోబర్ 19) ప్రసారమయ్యే ఎపిసోడ్ లో వస్తుంది.

కాకపోతే కేవలం ప్రోమో చూసిన కొందరు మాత్రం.. రష్మి మీద సుధీర్ చేతులు వేసేయడంతో ఆమెకు పీకలదాకా కోపం వచ్చేసిందని అనుకుంటున్నారు. ఎంతైనా కూడా ప్రోగ్రామ్ ను పాపులర్ చేయడానికి ఇలాంటి మసాలా గాసిప్స్ కు అవకాశం ఉండేలా కొన్ని ఫీట్లు చేస్తే.. అవే భలే క్లిక్ అవుతాయ్ గురూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/