Begin typing your search above and press return to search.
అంత 'నైస్'గా సోపేయకండి సార్.. ఇది మనందరిదీ: హీరోపై రష్మిక
By: Tupaki Desk | 9 April 2021 7:00 AM ISTతమిళ హీరో కార్తీ ఖైదీ బ్లాక్ బస్టర్ తర్వాత సుల్తాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన సుల్తాన్ మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ తో మంచి హిట్ అందుకుంది. కానీ సుల్తాన్ తెలుగు వెర్షన్ మాత్రం జనాలకు పెద్దగా ఎక్కలేదు. అందుకే తెలుగు రాష్ట్రాలలో సుల్తాన్ మూవీ సోసోగా రన్ అవుతోంది. అయితే బుధవారం సుల్తాన్ టీమ్ అంతా తమిళనాడులో సినిమా హిట్ అవ్వడంతో సక్సెస్ మీట్ జరుపుకున్నారు. ఈ థాంక్స్ మీట్ లో హీరో కార్తీ, సుల్తాన్ మేకర్స్ తో కలిసి ఆనందం వ్యక్తం చేసాడు. తమిళంలో సుల్తాన్ భారీ ఓపెనింగ్స్ రాబట్టినందున సినిమా విజయాన్ని హీరో రష్మికకు క్రెడిట్ ఇచ్చేసాడు. ఈ సందర్బంగా కార్తీ మాట్లాడుతూ.. సుల్తాన్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి కారణం హీరోయిన్ రష్మిక అభిమానులే కారణమని చెప్పాడు.
అయితే కార్తీ క్రెడిట్ ఇచ్చిన విషయం తెలిసి రష్మిక ట్విట్టర్ ద్వారా స్పందించింది. "అంత క్రెడిట్ నాకివ్వకండి కార్తీ సార్. మీరు నన్ను ఇప్పుడు ఏడ్చేలా చేస్తున్నారు. ఈ విజయం దక్కింది సుల్తాన్ సినిమా వలనే.. అందుకు కారణం నిజమైన హార్డ్ వర్క్.. అదిగాక ఈ విజయానికి మనందరం కారణం" అంటూ ట్వీట్ చేసింది. ఈ విధంగా రష్మిక భారం మొత్తం తనపై పడకుండా క్రెడిట్ అందరిదీ అని తెలివిగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం రష్మిక ట్వీట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అదేవిధంగా హార్డ్ వర్క్ నమ్ముకుంటే నెవర్ ఫెయిల్స్ అనేది మళ్లీ రుజువైందని కార్తీ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సుల్తాన్ క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా అందరూ స్పందించడంతో హ్యాపీగా ఉన్నట్లు కార్తీ తెలిపాడు. ఈ సినిమాను ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మించగా.. వివేక్ - మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.