Begin typing your search above and press return to search.

అతనితో టూర్ కు వెళ్తే తప్పేంటి.. శ్రీవల్లి ప్రశ్న వైరల్‌

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:35 AM GMT
అతనితో టూర్ కు వెళ్తే తప్పేంటి.. శ్రీవల్లి ప్రశ్న వైరల్‌
X
రష్మిక మందన్నా ఆ మధ్య విజయ్ దేవరకొండ తో కలిసి విదేశాలకు హాలిడే ట్రిప్ వెళ్లింది అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇద్దరు కలిసి వెళ్లకున్నా కూడా ఇద్దరు ఒక్క చోటుకే వెళ్లారు అంటూ ఆ సమయంలోనే క్లియర్ గా అర్థం అయ్యింది.

మొదట తామిద్దరం కలిసి ట్రిప్ కు వెళ్లినట్లుగా వచ్చిన వార్తలను లైట్ తీసుకున్న రౌడీ స్టార్‌ మరియు రష్మికలు ఆ తర్వాత స్పందించారు. మొదట నో అన్నా ఆ తర్వాత మాత్రం ఔను మేము కలిసి ట్రిప్ కు వెళ్లాము అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరం కలిసి హాలీడే ట్రిప్‌ కు వెళ్లాం అంటూ రష్మిక మందన్నా పేర్కొంది.

అతడితో విహార యాత్రకు వెళ్లినంత మాత్రాన తప్పేంటి అన్నట్లుగా రష్మిక ప్రశ్నించింది. ప్రస్తుతం రష్మిక యొక్క ఆ ప్రశ్న సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆన్ లైన్ లో రష్మిక మందన్నా ను ఈ మధ్య తెగ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నతో రష్మిక ను తీవ్రంగా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండతో రిలేషన్‌ షిప్‌ గురించి వస్తున్న వార్తలను రష్మిక కొట్టి పారేసింది. మేము ఇద్దరం మంచి స్నేహితులం.. స్నేహితులుగా మాత్రమే ట్రిప్ కు వెళ్లాము అన్నట్లుగా ఆమె పేర్కొంది. కానీ జనాలు మాత్రం వీరి రిలేషన్‌ షిప్ నెక్ట్స్ లెవల్‌ కు చేరింది అంటూ బలంగా వాదిస్తున్నారు.

గీత గోవిందం మరియు డియర్ కామ్రెడ్‌ సినిమా ల్లో కలిసి నటించిన వీరిద్దరు ఆ తర్వాత కూడా పలు స్నేహం కొనసాగిస్తున్నారు. పలు సార్లు విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి రష్మిక కనిపించింది. అంతే కాకుండా ఇద్దరు ట్రిప్స్ కు వెళ్తూ ఉన్న కారణంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. అవి కేవలం అనుమానాలే అని నిరూపించాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.