Begin typing your search above and press return to search.

వినాయ‌క చ‌వితి చందాలు వ‌సూల్ చేసిన ర‌ష్మిక‌!

By:  Tupaki Desk   |   31 Aug 2022 8:55 AM GMT
వినాయ‌క చ‌వితి చందాలు వ‌సూల్ చేసిన ర‌ష్మిక‌!
X
గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల ప్ర‌త్యేక‌తల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వినాయ‌కుడి ప్ర‌త‌మని ప్ర‌తిష్టించి వారం రోజుల పాటు ఘ‌నంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తుంటారు. గ‌ల్లికో వినాయ‌కుడు వెలుస్తాడు. గ‌ణ‌బ‌ప్ప మోరియా అంటూ వ‌య‌సు వ్య‌త్యాసం లేకుండా అంద‌రూ పిల్ల‌లైపోతారు. వారం-ప‌ది రోజుల ముందు నుంచే చందా వ‌సూళ్ల కార్య‌క్ర‌మం ఉంటుంది.

తోచినంత చందా ఇచ్చి ఉత్స‌వాల్లో పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా జ‌రిగే అతి పెద్ద హిందు పండుగ ఇది. ఈ పండుగ‌ని న‌టి ర‌ష్మిక మంద‌న్న సైతం ఏమాత్రం మిస్ అవ్వ‌ను అంటోంది. వినాయ‌కుడి పూజ‌లో ఏటా త‌ప్ప‌కుండా పాల్గొని ఆ గ‌ణ‌ప‌తి ఆశీస్సులు త‌ప్ప‌క అందుకుంటాను అంటోంది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డు కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంది.

''గ‌ణ‌ప‌తి పేరెత్తితో కాలేజీ డేస్ గుర్తొస్తాయి. మాప్రెండ్స్ మిగ‌తా విద్యార్దులంతా క‌లిసి గ్రూప్ గా ఏర్ప‌డి చందాలు వ‌సూల్ చేసే వాళ్లం. చ‌క్క‌గా రంగు రంగు కాగితాల‌తో వినాయ‌కుడు మండ‌పాన్ని అలంక‌రించేవాళ్లం. గ‌ణ‌ప‌తి బొమ్మ‌ని నిమ‌జ్జ‌నం చేసే వ‌ర‌కూ అక్క‌డే స‌మ‌యాన్ని గ‌డిపేవాళ్లం. రోజు డాన్సులు..ఆట పాట‌ల‌తో అంద‌ర్నీ అల‌రించేవాళ్లం.

నిజంగా ఆరోజులు చాలా బాగుండేవి. మ‌ళ్లీ ఆరోజుల్లోకి వెళ్లిపోవాల‌నిపిస్తుంది. ఇక ఉత్స‌వాల స‌మ‌యంలో అందుబాటులో ఉంటే గ‌న‌క త‌ప్ప‌కుండా వినాయ‌కుడ్ని ద‌ర్శించుకుంటాన‌ని తెలిపింది. అలాగే ర‌కుల్ ప్రీత్ సింగ్ సైతం వినాయ‌క ఉత్స‌వాల్లో కుదిరిన‌ప్పుడ‌ల్లా పాల్గొంటిదిట‌. '' ఈ వేడుక‌ల గురించి ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన త‌ర్వాతే తెలిసింది.

ఎందుకంటే మా పంజాబీ ఫ్యామిలీస్ లో ఈ వేడుక‌లు పెద్ద‌గా జ‌రుపుకోరు. ఆ ర‌కంగా వినాయ‌కుడి గురించి చిన్న‌నాటి జ్ఞాప‌కాలు లేవు. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సెట్లో వినాయ‌కుడ్ని పెట్టి పూజ‌లు నిర్వ‌హించ‌డం చూసాను. చ‌వితి అన‌గానే ముంబై గుర్తొస్తుంది. అక్క‌డ వేడుక‌లు ఎంతో ఘ‌నంగా జ‌రుపుతారు. నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మాలు ఎంతో వైభ‌వంగా జ‌రుగుతుంటాయి.

ముంబైలో నా ప్రెండ్ ఉండే కాల‌నీలో ప్ర‌తీ ఏడాది వినాయ‌కుడుని ప్ర‌తిష్టిస్తారు. అక్క‌డ ఉన్న‌ప్పుడు స్నేహితురాలితో క‌లిసి వెళ్లి ద‌ర్శించుకునే దాన్ని. ఇక ఆ పండుగ రోజు చేసే బూరెలు అంటే చాలా ఇష్టం. ఆ రుచి ఇంకే పండుగ‌లోనూ ఉండ‌దు' అని చెప్పుకొచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.