Begin typing your search above and press return to search.

సొంత వారికి చేరువయ్యేందుకు రష్మిక మరో విఫలయత్నం

By:  Tupaki Desk   |   22 Dec 2022 10:40 AM GMT
సొంత వారికి చేరువయ్యేందుకు రష్మిక మరో విఫలయత్నం
X
కన్నడంలో హీరోయిన్‌ గా పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగు లో ఛలో.. గీతా గోవిందం సినిమాలు సక్సెస్ అవ్వడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరం అయినట్లుగా వ్యవహరించింది. అంతే కాకుండా అంతకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో వివాహ నిశ్చితార్థం చేసుకుని టాలీవుడ్‌ లో సక్సెస్ రాగానే ఆ నిశ్చితార్థం క్యాన్సిల్‌ చేసుకుందనే విమర్శలు ఎదుర్కొంది.

మొత్తానికి కన్నడ ప్రేక్షకులు రష్మిక మందన్నా ను చాలా సంవత్సరాలుగా విమర్శిస్తూనే ఉన్నారు. ఏదో ఒక కారణంగా ఆమెపై కన్నడ ప్రేక్షకులకు కోపం పెరుగుతూనే ఉంది. ఆ మధ్య కాంతార సినిమా విషయంలో రష్మిక మందన్నాకు చాలా పెద్ద డ్యామేజీ జరిగింది అనడంలో సందేహం లేదు.

కన్నడ ప్రేక్షకులు రష్మిక మందన్నా ను బాయ్ కాట్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాంటి రష్మిక మందన్నా మెల్ల మెల్లగా కన్నడ ప్రేక్షకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంతార గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేయడంతో పాటు తాజాగా కన్నడ దివంగత సూపర్ స్టార్‌ పునీత్‌ రాజ్ కుమార్ ను గుర్తు చేసింది.

అయిదు సంవత్సరాల క్రితం పునీత్‌ రాజ్‌ కుమార్‌ తో నటించిన సినిమా అంజనిపుత్ర ను గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆ సినిమా సమయంలో పునీత్ సర్ తో మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆయన ఒక అద్భుతమైన నటుడు అన్నట్లుగా పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా హర్ష సర్‌ నాకు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ లో పేర్కొంది.

హీరోయిన్‌ గా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలి అనుకున్న రష్మిక మందన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోయింది. దాంతో చేసేది లేక మళ్లీ సౌత్‌ సినిమాలపై రష్మిక దృష్టి పెట్టిందని.. అందులో భాగంగానే కన్నడంలో కూడా మళ్లీ నటించేందుకు ప్రయత్నాలు చేస్తూ తన సొంత ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కానీ ఈసారి కూడా ఆమె ప్రయత్నం విఫలం అయ్యిందనే చెప్పాలి... సోషల్‌ మీడియాలో రష్మిక మందన్నా యొక్క ట్రోల్స్ ఆగడం లేదు. ముందు ముందు అయినా రష్మిక అంటే కన్నడ ప్రేక్షకులకు కోపం తగ్గుతుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.