Begin typing your search above and press return to search.
పాపం.. పుట్టినరోజు నాడు ఏడ్చేసిన రష్మిక
By: Tupaki Desk | 7 April 2020 8:10 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న కన్నడ బ్యూటీ.. రష్మిక మందన్న. 'కిరాక్ పార్టీ' సినిమాతో పాపులర్ అయిన రష్మిక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 'ఛలో' సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు భామ 'గీత గోవిందం' తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండతో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత నితిన్ సరసన నటించిన 'భీష్మ' సినిమా కూడా హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస విజయాలు వచ్చి పడటంతో వరుస అవకాశాలు కూడా తలుపు తట్టాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తన సక్సెస్ రేట్ ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం తో ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది.
మన తెలుగు పిల్లే అనేంతగా టాలీవుడ్ లో కలిసి పోయిన రష్మిక ఆదివారం తన 24వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కనీసం పుట్టిన రోజు అని కూడా ఆలోచించకుండా రష్మిక కంట కన్నీళ్లు తెప్పించాడో అభిమాని. అసలు పుట్టిన రోజే లేకపోతే బహుశా ఆమె ఏడ్చే అవకాశం ఉండేది కాదేమో. బాధ కలిగినా, ఆనందం వచ్చినా కన్నీళ్లే వస్తాయంటారు. ఇంతకూ రష్మిక కన్నీళ్లకు కారణమేంటో తెలుసుకుందాం. రష్మిక పుట్టిన రోజు సందర్భం గా ఆమె అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేశారు. రష్మికకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. రష్మికపై భక్తి పెరిగిన ఓ అభిమాని ఏకంగా ఆమె పేరుపై దేవుడికి పాలాభిషేకం చేయించాడు. ఆ వీడియోను చూసిన రష్మిక ఆనందంతో పొంగిపోయారు. అయితే 'ఇంత ప్రేమ పొందడానికి నేనేం చేశాను' అని రష్మిక పోస్ట్ చేశారు.
అలాగే మరో వ్యక్తి వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చాడు. రష్మిక ఇప్పటివరకు నటించిన సినిమాల్లోని సీన్లను కలిపి 'రష్మిక ఇన్స్పిరేషనల్ జర్నీ' పేరుతో వీడియో రూపొందించి పంపాడు. ఈ వీడియో చూసి రష్మిక భావోద్వేగానికి గురైంది. ఆమె నోట మాట రాలేదు. 'నువ్వు నన్ను భావోద్వేగానికి గురి చేశావు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా ధన్యవాదాలు' అని తన కృతజ్ఞతను చాటుకున్నారామె. ఇదన్న మాట రష్మిక కంట కన్నీరు పెట్టడానికి కారణం. ఏదేమైనా రష్మికాని తన అభిమానులు ఏ విధంగా ఆరాధిస్తారో ఈ ఇన్సిడెంట్ తో అర్థమై పోయింది రష్మిక మందన్నకి.