Begin typing your search above and press return to search.
బన్నీ కామెంట్ కి జతగా రష్మిక బూస్ట్!
By: Tupaki Desk | 14 Nov 2021 5:30 PM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం `పుష్ప- ది రైజింగ్ ` డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేసారు. దీనిలో భాగంగా ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఆడియో మ్యూజికల్ గా ముందే పెద్ద సక్సెస్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు శ్రోతల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి మరో మాస్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది.
`ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా` అంటూ సాగే మాస్ పాటను నవంబర్ 19న రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈపాట రిలీజ్ కోసం బన్నీనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. తన ఫేవరేట్ సాంగ్ అని కామెంట్ చేయడంతో ఆ పాట ఎలా ఉండబోతుందా? అంటూ బన్ని అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా నటిస్తోన్న రష్మిక మందన్న కూడా లైన్ లోకి వచ్చింది. ఈ పాట సూపర్బ్ గా ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆ క్షణాలో కోసం ఇప్పటి నుంచి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.
ఇలా హీరో..హీరోయిన్లు ఇద్దరి కామెంట్లతో పాటపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అభిమనుల్లో సైతం ఎగ్జైట్ మెంట్ రెట్టింపు అవుతోంది. పుష్ప రాజ్ అలా అంటే శ్రీవల్లి ఇలా అంది! అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ ఆ మాటల్ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. పాటలతోనే సినిమా అంచనాల్ని పీక్స్ కి తీసుకెళుతున్నారు. ఇక టీజర్..ట్రైలర్ తో పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఇంకేస్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.