Begin typing your search above and press return to search.

'రంజిత‌మే' అంటూ రంగేసావ్ క‌దా! ర‌ష్మిక‌

By:  Tupaki Desk   |   26 Dec 2022 6:20 AM GMT
రంజిత‌మే అంటూ రంగేసావ్ క‌దా! ర‌ష్మిక‌
X
వ్వాటే బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ప' తో ద‌క్కిన పాన్ ఇండియా క్రేజ్ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటోంది. ఆ సినిమా గుర్తింపుతో వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటుంది. బాలీవుడ్ లోనూ అవ‌కాశాలు రావ‌డంతో? స్టైల్ ఐకాన్ గానూ ఫేమ‌స్ అవుతుంది. డ్రెస్సింగ్ సెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.

న్యూ ట్రెండ్ ని ఫాలోఅవుతూ త‌న‌దైన మార్క్ వేస్తుంది. బాలీవుడ్ భామ‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ముస్తాబ‌వుతుంది. స్టైల్ కా బాప్ అనిపిస్తూనే అగ్గి రాజేసే అందాల‌తోనూ ఆక‌ట్టుకుంటోంది. ఆర‌కంగా నార్త్ లో బాగానే ఫేమ‌స్ అవుతుంది. ఇక తెలుగులో తాను సాధించాల్సిందే ఇప్ప‌టికే సాధ్య‌మైంది. తాజాగా బ్యూటీ ఇదే వేడిలో కోలీవుడ్ ని షేక్ చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడిప్పుడే ఆక్క‌డా స్టార్ హీరోల‌తో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న 'వార‌సుడు'లో ఆయ‌న‌కు జోడీగా న‌టిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చెన్నైలో జ‌రిగిన ఆడియా లాంచ్ కార్య‌క్ర‌మంలోనూ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా స్టేజ్ పై త‌న‌దైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. విజయ్ అభిమానులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చింది.

కొరియోగ్రాఫర్ జానీతో పాటు క‌లిసి రష్మిక సూపర్‌హిట్ 'రంజితమే' పాటకు హుక్ స్టెప్ అందుకుంది. స్టేజ్‌పై రష్మిక లెగ్ మూవ్ మెంట్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అప్ప‌ట్లో 'సామీ సామీ' అంటు కుర్రాళ్ల గుండుల్లో సెగ‌లు పుట్టిస్తే...ఇప్పుడు 'రంజిత‌మే' అంటూ రంగు ప‌డేలా చేసింది. దీంతో ప్ర‌మోష‌న్ ప‌రంగా టీమ్ ర‌ష్మిక‌పై భారీ ఆశ‌లే పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఆడియో లాంచ్‌లోనే ఇలా ఉంటే.. ప్రమోషనల్ టూర్స్‌లో రష్మిక ని ఆప‌గ‌ల‌మా? అంటూ చ‌ర్చించుకుంటున్నారు. తెలుగు వెర్ష‌న్ రిలీజ్ ప‌రంగా ర‌ష్మిక కీల‌కం కానుంది. అమ్మ‌డికి ఇక్క‌డ మంచి ఫాలోయింగ్ ఉంది.

క‌న్న‌డ న‌టి అయినా తెలుగు చ‌క్కగా మాట్లాడ‌గ‌ల‌దు. త‌న‌దైన మార్క్ చ‌లాకీత‌నంతో దూసుకుపోతుంది. ఆ రకంగా సినిమాకి వీలైనంత‌గా ప్రచారం తేగ‌ల‌దు. అందులోనూ వెనుక దిల్ రాజు ఉంటాడు కాబ‌ట్టి! మ‌రింత ఉత్సాహం తోడ‌వుతుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.